నాగ్, రజినీ కలిసిన వేళ.. ఏం జరిగిందో తెలుసా..?

Nagarjuna & Rajinikanth Coolie: కోలీవుడ్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన క్రేజీ మూవీ కూలీ. ఈ సినిమాకి లోకేష్‌ కనకరాజ్ డైరెక్టర్. ఈ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింతగా క్రేజ్ పెరిగింది. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బజ్ బాగా క్రియేట్ అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ తో కూలీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. సెట్ లో రజినీ వచ్చినప్పుడు ఏం జరిగిందో నాగ్ బయటపెట్టారు. ఇంతకీ.. ఏం జరిగింది..?

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. కథ చెప్పినప్పుడు తాను చెప్పిన మార్పులను చేయాలని అడిగానని.. లోకేష్ అలానే 6, 7 సార్లు తిరిగి తాను చెప్పిన మార్పులు చేర్పులు చేసాడని.. అలా తను చెప్పినట్టుగా మార్పులు చేర్పులు చేశాడు కాబట్టే ఈ సినిమా చేశానని చెప్పారు కింగ్ నాగార్జున. అంతే కాకుండా లోకేష్‌ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలు చూసి అతని డైరెక్షన్ లో సినిమా చేయాలని అనుకున్నా.. తను అనుకున్నానో లేదో కూలీ కథతో తన దగ్గరకు వచ్చాడని అన్నారు నాగార్జున. మన దేశంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో లోకేష్ ఒకడు. అతని టాలెంట్ మాత్రమే కాదు మంచి మనసున్న వాడు అని చెప్పారు. Nagarjuna & Rajinikanth Coolie.

ఇక సూపర్ స్టార్ గురించి చెబుతూ.. రజినీకాంత్ గారు.. ఫస్ట్ నా గెటప్ చూసే ఇలా ఉంటాడనుకుంటే అసలు వద్దనే వాడినని అన్నారు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అని అడిగారు.. ఆయనతో కలిసి ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు చర్చించాం. ఆయన తన అనుభవాలన్నీ చెప్పారు. అంతే కాదు 18 రోజుల షిప్ షూటింగ్ లో వెళ్తూ వెళ్తూ యూనిట్ కి ప్యాకెట్స్ ఇచ్చి ఇంట్లో వాళ్లకు ఏదైనా కొనుక్కోని వెళ్లండని చెప్పారు. అది ఆయన మంచి మనసు అన్నారు నాగార్జున. రజినీకాంత్ గారు నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. లోకేష్ తో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉందన్నారు కింగ్ నాగార్జున.

ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే రజినీకాంత్ సినిమాలకు అయితే.. వేరే లెవల్లో మ్యూజిక్ అందిస్తాడు. ట్రైలర్ లో శాంపిల్ చూపించాడు. ఇక థియేటర్స్ లో ఈ సినిమా చూస్తే పూనకాలు రావడా ఖాయం అనేట్టుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటిస్తుండడంతో ఆడియన్స్ లో రోజురోజుకు క్యూరియాసిటీ పెరుగుతోంది. ఆగష్టు 14న కూలీ రాబోతోంది. మరి.. ఇండియన్ బ్యాక్సాఫీస్ దగ్గర కూలీ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/akhanda-2-release-date-has-been-changed/