
Rashmika Mandanna in ‘Kanchana 4’: ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన్న. గత ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప 2’లో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుంది. ఈమె చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే ఇప్పటివరకు స్కోప్ ఉన్న పాత్రలో నటించిన రష్మిక.. ఈసారి హారర్ సినిమాలో నటించబోతుందట. అది కూడా సౌత్ హారర్ హిట్ ఫ్రాంచైజీ లో భాగం కానుందని సమాచారం.
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ముని, కాంచన, గంగ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే ప్రాంచైజీ లో రాబోతున్న ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హర్రర్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆధరణ ఉంది. ఇటీవల హిందీ లో విడుదలైన ‘స్త్రీ 2’ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. కాంచన 4 నూ ఆ స్థాయిలో రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
అందులో భాగంగానే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేశారట మేకర్స్. ఈ క్రమంలోనే యానిమల్, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ‘కాంచన 4’ లో కనిపించనుందట. ఇప్పటికే రష్మిక ఈ మూవీ షూటింగ్ లో రష్మిక జాయిన్ అయ్యిందని తెలుస్తుంది. రష్మిక లాంటి క్రేజీ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తే హిట్ అవ్వడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈమెతో పాటూ మన బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి సైతం కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రష్మిక కన్నా ముందే ఈ ఇద్దరు హీరోయిన్లు కాంచన 4 షూట్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేషనల్ క్రష్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కాంచన 4 పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సౌత్ వరకు చూసుకుంటే రష్మిక హారర్ జోనర్ లో సినిమా చేయడం ఇదే మొదటి సారి.
కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికే హారర్ మూవీ స్త్రీ యూనివర్స్ నుంచి లేటెస్ట్ గా తెరకెక్కుతున్న ‘తమా’ అనే మూవీ చేస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ వదిలార. అందులో రష్మిక దెయ్యంగా భయపెట్టింది. ఇప్పుడు కాంచన 4 తో ఇంకెంత భయపెడుతుందో చూడాలి. Rashmika Mandanna in ‘Kanchana 4’.
రష్మిక మందన్న ఈ ఏడాది చివరగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. ఇక త్వరలో ఈ హీరోయిన్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q