‘రాజా సాబ్’ నుంచి నిధి అగర్వాల్ పోస్టర్..!

Nidhhi Agerwal Poster From Rajasaab: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి భారీ హిట్ తరువాత ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఆ రేంజ్ హిట్ అందుకున్నది లేదు. మంచి అవకాశాలను కూడా దక్కించుకున్నది లేదు. ఇక చాలాకాలం తర్వాత పవర్ స్టార్ కి జోడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ ఇటీవలే రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉన్నా నిధి నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే హిట్ ఖాతా మాత్రం తెరవలేకపోయింది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఆశలన్నీ ‘ది రాజాసాబ్’ పైనే పెట్టుకుంది. ఇక నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో తాజాగా ది రాజాసాబ్ టీమ్ ఒక కొత్త పోస్టర్ తో నిధికి బర్త్ డే విషెస్ తెలిపింది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. చాలాకాలం తర్వాత డార్లింగ్ ఈ మూవీలో వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే ముగ్గురు హీరోయిన్స్ తో రోమాన్స్ చేయబోతున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన నిది అగర్వాల్అ, మాళవిక మోహనన్యి, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నేడు నిధి అగర్వాల్ బర్త్ డే కావడంతో మూవీటీమ్ ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ది రాజాసాబ్ టీమ్ ఒక కొత్త పోస్టర్ తో నిధికి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ సినిమాలో నిధి ఒక నన్ గా కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో వైట్ డ్రెస్ లో జీసెస్ కు దండం పెడుతూ కనిపించింది. ‘ఎంతో అందమైన, టాలెంట్ ఉన్న నిధి అగర్వాల్ కు ది రాజాసాబ్ టీమ్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు. నిధి పాత్ర కింగ్ సైజ్ లాంటి కథకు మరింత గ్రేస్ ను తీసుకొస్తుంది. ఆమె పాత్ర చాలా లోతుగా ఉండబోతుంది’ అని మూవీ టీమ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. Nidhhi Agerwal Poster From Rajasaab.

మరోవైపు ‘ది రాజా సాబ్’ రెండు పార్టులుగా వస్తుందని చెప్పి ఇటీవలే సర్‌ప్రైజ్ చేశారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. రాజా సాబ్ మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుందని, అయితే ఇది రెగ్యులర్ సీక్వెల్స్‌లా కాకుండా.. ఓ ఫ్రాంఛైజీలా, మల్టీయూనివర్స్‌లా ఉంటుందని చెప్పారు. సినిమా రిలీజ్ తర్వాత మీకు ఈ విషయం గురించి ఫుల్ క్లారిటీ వస్తుందని తెలిపారు. ఈ సినిమాలో హార్రర్ సీన్లు నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. అంతే కాదు అసలు వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి హార్రర్ సీన్లు ఎప్పుడూ చూడలేదు అని ఆ మధ్య నిర్మాత విశ్వ ప్రసాద్ ఎలివేషన్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q