
US OG pre-bookings: ఆంధ్రా నుంచి అమెరికా వరకు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ క్రేజ్ పీక్స్ కు చేరింది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసారు. రిలీజ్ అయినా వెంటనే అవి ఇంటర్నెట్ లో సంచలన రికార్డులు సృష్టించాయి. ఈ చిత్రానికి పోటీగా ఉన్న ‘అఖండ 2’ వాయిదా పడటంతో దసరా రేసులో ఈ చిత్రం సింగిల్‌గానే దిగుతోంది. ఇక ఇండియాలో సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం, అమెరికాలో ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. రెండ్రోజుల క్రితమే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఓజీ జస్ట్ ప్రీ బుకింగ్స్ తోనే ఏకంగా ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ , ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ఓజీ ’ చిత్రం దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి పోటీగా ఉన్న ‘అఖండ 2’ వాయిదా పడటంతో దసరా రేసులో ఈ చిత్రం సింగిల్‌గానే దిగుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే సరిగ్గా రెండు రోజుల క్రితం ఓవర్సీస్ లో OG ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. US లో బుకింగ్స్ మొదలు పెట్టి మూడు రోజులు కాకముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ రాబట్టిందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ సేల్స్ 5 లక్షల డాలర్లకు పైగా జరగాయని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. టైటిల్ సాంగ్‌లోని ‘క్షణక్షణమొక తల తెగి పడెలే’ లిరిక్ ని షేర్ చేస్తూ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలు కూడా ఓవర్సీస్లో ఇంత తక్కువ సమయంలో అంత ఫ్రీ బుకింగ్స్ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి.
దీనిబట్టి చూస్తే OG సినిమా కి ఉన్న క్రేజ్ మన ఊహించినదానికంటే ఎక్కువే ఉన్నటు అర్ధమవుతుంది. ఇది ఇలానే కొనసాగితే, OG ఓపెనింగ్ డే కలెక్షన్లు ఏకంగా 200 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే OG బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవనుంది అని ట్రేడ్ వర్గాలు, సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్ డేట్ కి ఇంకా ఇరవైఐదు రోజులు ఉండగానే ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది అంటే రాన్నున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఓపెనింగ్ డే రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. US OG pre-bookings.
ఇటీవల వచ్చిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం అన్నిచోట్లా డిజాస్టర్‌గా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ‘ఓజీ’పైనే ఉంది. ఈ మూవీకి క్రియేట్ అయిన హైప్‌తో గత రికార్డులన్నీ చెరిపేసి పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ‘ఓజీ’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి, సిరి లేళ్ల, ప్రకాష్ రాజ్, షాన్ కక్కర్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు హాట్ బ్యూటీ నేహా శెట్టి ఐటెమ్ సాంగ్‌లో నర్తించనుందని టాక్ వినిపిస్తోంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q