నాని ప్లాన్ మారుతుంది అనుకుంటే.. చరణ్‌ ప్లాన్ మారిందా..?

Paradise And Peddi: ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. అయితే.. సంవత్సరం ముందుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. పక్కాగా అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందనే గ్యారెంటీ లేదు. రిలీజ్ డేట్స్ మారిపోవడం అనేది కామన్ అయిపోయింది. అయితే.. మార్చి 26న నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ అని ప్రకటించారు. అలాగే మార్చి 27న చరణ్ పెద్ది సినిమా విడుదల అని అనౌన్స్ చేశారు. ఒక రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడం రెండు సినిమాలకు ఇబ్బందే. అందుచేత రిలీజ్ డేట్స్ లో మార్పు రావడం ఖాయమని.. చరణ్‌ కోసం నాని ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. ఇప్పుడు చరణ్ పెద్ది రిలీజ్ డేటే మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఈ ఇద్దరిలో ఏ సినిమా రిలీజ్ డేట్ మారబోతుంది..?

నాని ప్యారడైజ్ మూవీని దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ తోనే అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉంటుందని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. అయితే.. నాని మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి కూడా శ్రీకాంత్ ఓదెలనే డైరెక్టర్. అందుచేత మెగాస్టార్ తో సినిమాని నిర్మిస్తూ.. మెగాస్టార్ తనయుడు చరణ్‌ పెద్ది సినిమాకి పోటీగా నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ చేయడని.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను నాని మార్చడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే.. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కూడా మార్చి 26న ప్యారడైజ్ రావడం ఖాయమని మరోసారి కన్ ఫర్మ్ చేయడం ఆసక్తిగా మారింది.

ఇక పెద్ది విషయం ఏంటంటే.. ఇటీవల ఈ క్రేజీ మూవీ కోసం ఢిల్లీలో షూటింగ్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. చరణ్‌ కు జంటగా నటిస్తుంది. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా శివరాజ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చూపించారు. చరణ్‌, శివన్న మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ.. ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమా రిలీజ్ ను మార్చి నుంచి సమ్మర్ కి షిప్టే చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మార్చి 26న ప్యారడైజ్ వస్తుంది. ఒక రోజు గ్యాప్ లో సినిమా రిలీజ్ చేస్తే రెండు సినిమాలకు ఇబ్బందే. అలాగే సమ్మర్ లో రిలీజ్ చేస్తే.. హాలీడేస్ కలిసొస్తాయి.. ఎక్కువ మందికి పెద్ది సినిమా రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో రిలీజ్ ప్లాన్ మార్చాలి అనుకుంటున్నారట మేకర్స్. ఉప్పెన సినిమా తర్వాత నుంచి బుచ్చిబాబు ఈ సినిమా కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నాడు. చరణ్‌ కు ఈ కథ ఎంతగానో నచ్చడంతో ఒక సినిమానే తీసిన ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు అవకాశం ఇచ్చాడు. మరి.. చరణ్‌, బుచ్చిబాబు కలిసి పెద్ది సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/nithin-backs-down-with-a-series-of-flops-and-nithin-doesnt-take-remuneration-for-yellamma/