అకీరా తో పవన్.. ఏం కటౌట్ రా సామీ..!

Pawan Kalyan And Akira Cutout in Bangalore: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తనయుడు అకిరా నందన్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎప్పుడెప్పుడు అకిరా ఎంట్రీ ఉంటుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ మాత్రం అకిరా ఎంట్రీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అకిరాకు సంబంధించి ఎలాంటి ఫోటో బయటకు వచ్చిన వెంటనే వైరల్ అయిపోతుంది. తాజాగా పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఈ ఫోటో ఏంటి..? ఎక్కడది..? అకిరా ఎంట్రీ ఎప్పుడు..?

పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాని క్రిష్‌, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. అన్ని అడ్డంకులను దాటుకుని వీరమల్లు సినిమా ఈ నెల 24న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఒకే రోజు ప్రెస్ మీట్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. దీంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. కామన్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా సౌత్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మేనియా మొదలైంది. Pawan Kalyan And Akira Cutout in Bangalore.

పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌ కటౌట్స్ తో పండగ వాతావరణం తపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. బెంగళూరులో అభిమానులు సందడి మొదలుపెట్టారు. అక్కడ పవన్ వీరమల్లు కటౌట్ పక్కనే మరో కటౌట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ కటౌట్ ఎవరిదో కాదు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ ది. దీనితో ఇద్దరూ కటౌట్స్ కలిపి కనిపించిన ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కటౌట్ వైలర్ అయినప్పటి నుంచి అకిరా ఎంట్రీ ఎప్పుడు అనేది మరోసారి వార్తల్లో నిలిచింది.

అకిరా ఎప్పుడు రెడీ అంటే.. అప్పుడు ఎంట్రీకి ఏర్పాట్లు చేసేందుకు పవర్ స్టార్ రెడీనే. కాకపోతే అకిరా డిసైడ్ అవ్వాలి.. తను రెడీ అని చెప్పాలి. రేణు దేశాయ్ దీని గురించి చాలా సార్లు చెప్పారు. అకిరా హీరోగా సినిమాల్లోకి వస్తాను అంటే అందరి కంటే తనే ఎక్కువగా హ్యాపీగా ఫీలవుతాను అని చెప్పారు. అకిరా కూడా పవన్ కళ్యాణ్‌ దగ్గర ఉంటూ ఇండస్ట్రీ గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరో వైపు పవన్ కళ్యాణ్ అకిరా ఎంట్రీకి సంబంధించిన బాధ్యతలను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించారని.. దీని వెనుక కసరత్తు జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. అకిరా ఎంట్రీ గురించి మరింతగా క్లారిటీ రావాలంటే.. మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదని సమాచారం.

Also Read: https://www.mega9tv.com/cinema/duvvada-jagannadham-reunion-allu-arjun-missing-pooja-hegde-post-goes-viral-on-social-media/