
OG Second Single Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలై, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో పవన్ అభిమానులు ఇప్పుడు పూర్తిగా ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘OG’ మీదే ఆశలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషన్‌లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.
ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో ముఖ్య సినిమాల నుంచి కీలక అప్డేట్లు రావడం పరిపాటే. ఈసారి కూడా అదే తరహాలో OG నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ అందిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రయూనిట్ కూడా ఓ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేసింది.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ జంట నడుమ సాగే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని రెండో పాటగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ఈ పాటను ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.OG Second Single Update.
ఇక సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ మెలోడీ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఆయన కంపోజిషన్ లో మెలోడీ అంటే అది కచ్చితంగా చార్ట్ బస్టర. సో OG రెండో సింగిల్ కూడా అలాంటి మ్యూజికల్ ఫీస్ట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్. మరో రెండు రోజుల్లో ఈ పాట ప్రోమో విడుదలయ్యే అవకాశముంది. పూర్తి పాటను 27న రిలీజ్ చేసే అవకాశముందని సమాచారం.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్, ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవే సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ మాస్ యాక్షన్ డ్రామాను DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించగా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.