బుట్టబొమ్మను వెంటాడుతోన్న బ్యాడ్ లక్..!

Pooja Hegde As Monica: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్దే, ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతోంది. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. గత కొంత కాలంగా పూజా ఏ సినిమా అది ప్లాప్ అవుతోంది. తాజాగా కూలీ లో మరోసారి ఇది రుజువైంది. దీంతో పూజా అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

‘అల వైకుంఠపురములో’ తర్వాత పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. అఖిల్తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ప్రభాస్తో చేసిన ‘రాధే శ్యామ్’, విజయ్ చేసిన ‘బీస్ట్’, రామ్ చరణ్ తో చేసిన ‘ఆచార్య’ సినిమాలు. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఆమెకు కలిసి రాలేదు. ‘సర్కస్’, దేవా, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాలు కూడా విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన పొందాయి. అంతేకాకుండా, తమిళ నటుడు సూర్యతో చేసిన ‘రెట్రో’ కూడా నిరాశనే మిగిల్చింది.

ఇక తాజాగా, ఆమె స్పెషల్ సాంగ్ చేసిన ‘కూలీ’ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో ‘మోనికా’ పాటలో ఆమె డ్యాన్స్ అందరినీ మెప్పించినప్పటికీ, సినిమాలో ఆ పాట ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. పూజా హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ చేసిన సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఆమె ఐరన్ లెగ్ అనే కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. Pooja Hegde As Monica.

ప్రస్తుతం పూజా చేతిలో తలపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమా ఉంది. అంటే ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందా? అంటూ తలపతి ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మొత్తం మీద వరుస పరాజయాలు పూజా హెగ్డే కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఆమెకు ఒక పెద్ద హిట్ ఎంత అవసరమో ఈ పరాజయాలు స్పష్టం చేస్తున్నాయి. మరి జన నాయగన్ తో అయినా బుట్టబొమ్మ ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q