‘ఫౌజి’ నుంచి ప్రభాస్ లుక్ లీక్..!

Prabhas Fauji Look Leak: ఈ మ‌ధ్య లీకుల బెడ‌ద అస‌లు త‌గ్గ‌డం లేదు. ప్ర‌తీ సినిమాకీ ఈ స‌మ‌స్య ఎక్కువైపోతుంది. మొన్నా మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న మెగా157 షూటింగ్ స్పాట్ నుంచి ఓ వీడియో లీకై సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవ‌డంతో మేక‌ర్స్ అలెర్ట్ అయి వెంట‌నే ఆ వీడియోను తొల‌గించి కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే స‌మ‌స్య మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమాకు వ‌చ్చింది. అది ప్రభాస్ నటిస్తోన్న సినిమాకు కావడం హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌భాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఫౌజి’ అనే భారీ పాన్ ఇండియా మూవీ తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే కదా! ప్రస్తుతం జెట్ స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నిన్న సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. లీక్ అయిన లుక్ చూస్తుంటే ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. గతంలో కంటే ఇందులో ఫ్రెష్ లుక్ లో ఉన్నాడు. ఇది చూసిన వారంతా తెగ షేర్ చేసేస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక్క దెబ్బకే ప్రభాస్ లుక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో మూవీ టీమ్ సీరియస్ గా స్పందించింది.

ఈ మూవీ గురించి ఎంతో మంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీకు అద్భుతమైన విజువల్స్ అందించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. కానీ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయినట్టు తెలిసింది. లా చేస్తే మా క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది. అలాగే మా టీమ్ నైతికత దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా ప్రభాస్ లుక్ లీక్ చేసినా, షేర్ చేసినా వాళ్ల ఐడీలు బ్లాక్ చేయడమే కాకుండా సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి కేసులు పెడుతాం. తర్వాత జైలుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ తెలిపింది మూవీ టీమ్. Prabhas Fauji Look Leak.

‘సీతారామం’తో హిట్ కొట్టిన హను రాఘవపూడి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీ-ఇండిపెండెన్స్ కాలంలో సాగే ఈ మూవీ లవ్, వార్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుంది. ప్రభాస్‌తో పాటు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తుండగా, సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమా కోసం డైరెక్ట్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. దాని బదులు డిజిటల్ రైట్స్‌ రూ.150-రూ.180 కోట్లు పేమెంట్‌గా తీసుకుంటున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా సినిమా షూటింగ్​ జరిగితే ‘ఫౌజీ’ 2026 ఏప్రిల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q