
Puri and Vijay Sethupathi combo for Pan India movie: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈమధ్య కాలంలో వరుసగా డిజాస్టర్స్ ఇచ్చి కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ డిపరెంట్ మూవీ చేస్తున్నాడు. ఇది రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా. ఈ మూవీ కోసం తీసుకున్న ఆర్టిస్టుల పేర్లు వింటుంటే.. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే.. ఈ సినిమాతో పూరి రిస్క్ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ రిస్క్ ఏంటి..? ఈ మూవీ అప్ డేట్ ఏంటి..?
విజయ్ సేతుపతి ఏ సినిమా పడితే.. ఆ సినిమాను.. ఎవరితో పడితే వాళ్లతో సినిమాను చేయడు. ఆయనకు కథ నచ్చాలి. కథ నచ్చితే ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ప్లాపుల్లో ఉన్నాడా..? అనేది ఆలోచించడు. అలా ఆలోచించడు కాబట్టే పూరితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. విజయ్ సేతుపతితో పూరి సినిమా అని ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక సీనియర్ హీరోయిన్ టబు ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా కన్ పర్మ్ చేయలేదు. Puri and Vijay Sethupathi combo for Pan India movie.
ఈ సినిమాని జూన్ లో స్టార్ట్ చేశారు. పూరి సంగతి తెలిసిందే కదా.. షూటింగ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే.. చక చకా తీసేస్తుంటాడు. ఈ సినిమాని కూడా తనదైన స్టైల్ లో చాలా స్పీడుగా తీస్తున్నాడట. హైదరాబాద్, చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని ఉండే కంటెంట్ పై పెద్ద చర్చే జరిగేలా ఉంటుందట. ముఖ్యంగా సోసైటీ గురించి.. పాలిటిక్స్ గురించి తనదైన కోణంలో పూరి చూపింబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో ఈ సినిమా తీస్తున్నాడు పూరి.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. డిసెంబర్ లో రాజాసాబ్, అఖండ 2, అవతార్ 3, డెకాయిట్.. ఇలా క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాల మధ్య పూరి సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అనే మాట వినిపిస్తోంది. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి కాబట్టి మంచి డేట్ చూసుకుని.. పోటీలేని టైమ్ లో రిలీజ్ చేస్తే బెటర్ అంటున్నారు సినీ జనాలు. పూరి మాత్రం ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలనే పట్టుదతలో ఉన్నాడట. మరి.. పూరి ఏం చేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.