
Puri Jagannath Met Prabhas on the Sets of Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వీరిద్దరి కాంబోలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్.. అనే రెండు సినిమాలు రూపొందడం.. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. అయితే.. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా.. ప్రభాస్ ను కొత్తగా చూపించడంతో మంచి పేరు తీసుకువచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికీ ఆ అనుబంధం అలాగే కొనసాగుతుంది. రీసెంట్ గా ప్రభాస్, పూరి కలిసారు. మరి.. ఈ క్రేజీ కాంబోలో సినిమా ఫిక్స్ కానుందా..? ఈ క్రేజీ కలయికకు కారణం ఏంటి..?
ప్రభాస్, పూరి కలసి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసిన్పటి నుంచి వీరి ఫ్రెండ్ షిప్ మరింత పెరిగింది. అయితే.. ఆ సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ మరింత పెరగింది.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పూరి జగన్నాథ్ మాత్రం కెరీర్ లో వెనకబడ్డాడు. అయితే.. ఇద్దరి మధ్య అప్పుడు ఎంత బాండింగ్ ఉందో.. ఇప్పటికీ అదే బాండింగ్ ఉంది. పూరి సినిమా కానీ.. పూరి తనయుడు ఆకాష్ సినిమా కానీ.. రిలీజ్ అయితే.. ప్రమోట్ చేయడానికి ముందుంటాడు ప్రభాస్. అడిగి మరీ.. సినిమాని ప్రమోట్ చేస్తాడంటే.. ఎంతటి ప్రేమో.. ఎంతటి అనుబంధమో అర్థం చేసుకోవచ్చు. Puri Jagannath Met Prabhas on the Sets of Rajasaab.

ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా హైదరాబాద్లో ప్రభాస్, పూరి జగన్నాథ్ కలిసారు. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారా అనే ప్రచారం మొదలైంది. విషయం ఏంటంటే.. జనరల్ గా ముంబాయిలో ఎక్కువుగా ఉండే పూరి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు. తను కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఇందులో టబు విలన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ప్రభాస్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు.
దీంతో రాజాసాబ్ షూట్ లో వీరిద్దరూ కలిసారు. పూరి తెరకెక్కిస్తోన్న సినిమాకి ప్రభాస్ బెస్ట్ విశేష్ తెలియచేశారు. వీరిద్దరూ కలిసిన ఫోటోలను పీఆర్ టీమ్ రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతటి అనుబంధం ఉన్నా వీరిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే ఛాన్స్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. పూరి అడిగితే ప్రభాస్ కాదనడు. వెంటనే ఓకే చెబుతాడు. అయితే.. పూరి ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ టైమ్ లో సినిమా చేయమని అడగడం కరెక్ట్ కాదని వెయిటింగ్ లో ఉన్నాడు. విజయ్ సేతుపతితో చేస్తోన్న మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే.. ఖచ్చితంగా పూరి తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి.. ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.