
Ram Charan ARC Cinemas: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగానే కాకుండా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇప్పడు మరో కొత్త బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. చెర్రీ ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారట. ఇప్పటికే మహేష్ బాబు – AMB సినిమాస్, అల్లు అర్జున్ – AAA సినిమాస్, రవితేజ – ART, విజయ్ దేవరకొండ – AVD పేర్లతో మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ థియేటర్లన్నీ ప్రముఖ పంపిణీదారుడు ఏషియన్ సునీల్‌తో కలిసి నడుపుతున్నారు. అయితే వీరందరి మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా తెలంగాణలో ఉన్నాయి.
ఇటీవల అల్లు అర్జున్ తన AAA సినిమాస్‌ను విశాఖపట్నంలో కూడా స్థాపించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అదే తరహాలో రామ్ చరణ్ కూడా ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. సమాచారం మేరకు ఆయన ARC సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. ఈ థియేటర్‌ను ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రాథమిక చర్చల దశలో ఉంది. త్వరలో స్థలం మరియు ఇతర వివరాలు ఖరారవుతాయని తెలుస్తోంది.
చెర్రీ కూడా బన్నీ తరహాలో విశాఖపట్నంలో థియేటర్ నిర్మిస్తారా? లేక విజయవాడ, తిరుపతి వంటి ప్రముఖ నగరాల్లో ఆలోచన చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్ సినిమా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో, ఈసారి పెద్దితో హిట్ కొట్టాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Ram Charan ARC Cinemas.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుంది. ఇటీవల సినీ కార్మికుల సమ్మె వల్ల కొద్ది రోజులు విరామం తీసుకున్నప్పటికీ, టీమ్ మళ్లీ బిజీ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేయడానికి శ్రమిస్తోంది. అంతేకాదు, ప్రతి రోజు షూట్ చేసిన ఫుటేజ్‌ను అదే రోజు ఎడిట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది 2026, మార్చి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.