
Andhra King Taluka Female lead: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్ డమ్. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. అయితే.. ఈ మూవీకి డివైడ్ టాక్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టాక్ తో ఎనర్జిటిక్ హీరో రామ్ టెన్షన్ పడుతున్నాడే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కింగ్ డమ్ రిజెల్ట్ కి.. రామ్ కు సంబంధం ఏంటి..? అసలు ఏమైంది..?
కింగ్ డమ్ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా జనాలకు ఏమాత్రం నచ్చలేదు. నూటికి డబ్బై ఐదు మంది బాగాలేదు అంటుంటే.. ఓ పాతిమంది మాత్రం బాగానే ఉంది అంటున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్ బాగానే వచ్చింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ లోకి వస్తున్నారు తప్పితే.. యావరేజ్ టాక్ కి జనాలు థియేటర్స్ లోకి రావడం లేదు. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. ఈ టాక్ తో కింగ్ డమ్ ఎంత కలెక్ట్ చేస్తుంది.. బ్రేక్ ఈవెన్ అవుతుందా..? డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తీసుకువస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే.. కింగ్ డమ్ సినిమాలో విజయ్ దేవరకొండకు జంటగా నటించింది భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువుగా ఉంటాయి. ఒక్కసారి ప్లాప్ వస్తే.. మరో ఛాన్స్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కింగ్ డమ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా హిట్ అయితే.. ఈ అమ్ముడు దశ తిరుతుంది అనుకుంటే.. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రాలేదు. Andhra King Taluka Female lead.
భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో రామ్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే.. భాగ్యశ్రీ నటించిన మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్.. ఈ రెండు సినిమాలు నిరాశపరచడంతో త్వరలో రానున్న తన సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందో అనే టెన్షన్ స్టార్ట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.