పవన్, క్రిష్ మధ్య విభేదాలు నిజమేనా..? అక్కడే సమస్య వచ్చిందా..?

Director Krish and Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాకి క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. ఇటీవల వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం.. రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుండడం తెలిసిందే. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా క్రిష్‌ కనిపించలేదు. దీంతో పవన్, క్రిష్ మధ్య విభేదాలు అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తలు క్రిష్ వరకు వెళ్లాయి. దీని పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ.. ఏమైంది..? క్రిష్ ఏం చెప్పారు..?

వీరమల్లు కాన్సెప్ట్ ను క్రిష్‌ రాసుకుని.. ఏఎం రత్నంకు చెబితే.. ఏఎం రత్నం పవన్ కళ్యాణ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ స్టోరీ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్‌ కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఆ విధంగా వీరమల్లు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అయితే.. పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో.. ఊహించని విధంగా వీరమల్లు బాగా ఆలస్యం అయ్యింది. ఎంత ఆలస్యం అంటే.. నిర్మాణానికి దాదాపు ఐదేళ్లు పట్టేంత. అన్ని అడ్డంకులు దాటుకుని ఇటీవల వీరమల్లు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే.. పవన్ కళ్యాణ్‌ ఈ మూవీని బాగా ప్రమోట్ చేసారు కానీ.. క్రిష్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

దీంతో పవన్, క్రిష్‌ మధ్య విభేదాలు అంటూ ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్‌ ఈ సినిమా ప్రమోషన్స్ లో.. క్రిష్‌ గురించి ప్రత్యేకించి మాట్లాడారు. ఆయన ఈ కథకు శ్రీకారం చుట్టారని.. మంచి ఆలోచన.. మంచి కథ అంటూ క్రిష్‌ ను అభినందించారు.. కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే క్రిష్‌ కూడా ఈ సినిమాకి ఇద్దరు లెజెండ్స్ కారణమని.. ఆ ఇద్దరే పవన్ కళ్యాణ్‌ గారు, ఏఎం రత్నం గారు అని చెప్పారు. అంతే కాకుండా వీరమల్లు గురించి క్రిష్‌ పెద్ద మెసేజే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం క్రిష్ ఘాటీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. Director Krish and Pawan Kalyan.

అయితే.. పవన్ తో విభేదాలు గురించి క్రిష్‌ స్పందించాడు. పవన్ కళ్యాణ్‌ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి కూడా సిద్దమే అని చెప్పారు. క్రియేటీవ్ డిఫరెన్స్ లు కూడా లేవని క్లారిటీ ఇచ్చాడు. దీంతో పవన్, క్రిష్ కు సంబంధించిన వార్తలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. క్రిష్‌ నెక్ట్స్ మూవీని బాలయ్యతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారు. మరి.. క్రిష్‌ అనుకుంటున్నట్టుగా భవిష్యత్ లో.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/biography/kaikala-satya-narayana-biography-and-the-names-given-to-yamas-characters-are-kaikala/