
Srinidhi Shetty in Trivikram’s Movie: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్, తనకు తగ్గ కమర్షియల్ సక్సెస్‌ను మళ్లీ రిపీట్ చేస్తూ బిజీ అవుతున్నాడు. ఆ సినిమాతో మళ్లీ మాస్లో తన క్రేజ్‌ని చూపించిన వెంకీమామ, ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలితరం ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే.
కానీ, ఈసారి మాత్రం తాను స్వయంగా డైరెక్షన్ తీసుకుంటూ వెంకటేష్‌ను పూర్తిస్థాయి హీరోగా డైరెక్ట్ చేయనున్నారు. నిజానికి త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా ఉండాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కాగా, చివరికి అది జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూవీ షురూ కావడానికి సమయం పడనుంది. దీంతో గ్యాప్‌ను సద్వినియోగం చేసుకుంటూ త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్లో ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది.
ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో, హీరోయిన్గా ఎవరుంటారు? అన్న దానిపై పలురకాల ఊహాగానాలు వినిపించాయి. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి వంటి పేర్లు ముందుగా తెరపైకి వచ్చాయి. కానీ తాజా బజ్ ప్రకారం, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ పాత్రకు ఫైనల్ అయినట్టు టాక్. ఇప్పటికే వెంకటేష్ తన గత చిత్రాల్లో యంగ్ హీరోయిన్లు అయిన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, శ్రద్ధా శ్రీనాథ్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో శ్రీనిధి శెట్టి చేరనుండడం విశేషం. త్వరలోనే మూవీ యూనిట్ దీనిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్, వెంకీ స్పెషల్ టైమింగ్ కలిసొస్తే.. ఈ కాంబినేషన్ మరో సూపర్ హిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. Srinidhi Shetty in Trivikram’s Movie.
మరోవైపు ఈ చిత్రానికి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ‘వెంకటరమణ C/o ఆనంద నిలయం’, ‘అలివేలు వెంకటరత్నం’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హారిక హాసిని బ్యానర్‌పై సూర్యదేవర చినబాబు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q