
SSMB29 Update: దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘SSMB 29’ పై అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా పలు దేశాల నుండి టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా గ్లోబల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ నవంబర్ లో మాత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేలా ssmb 29 కి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటికొచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కెన్యాలో జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి అక్కడి ప్రభుత్వ మంత్రి ముసాలియా ముదావాదిని కలవగా, ఆ సమావేశం అనంతరం కెన్యా మీడియాలో వచ్చిన కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. SSMB 29 కి సంబంధించి కెన్యాలో ప్రముఖ పత్రిక ఒక షాకింగ్ సమాచారం ఇచ్చింది. వారు రాసిన దాని ప్రకారం.. SSMB 29 ఒకే సినిమా కాదట! ఇది రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఫ్రాంచైజీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండు పార్ట్స్‌కు కలిపి సుమారు ₹1200 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని పేర్కొనడం గమనార్హం. ఈ కథనం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.ఈ న్యూస్ లో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది. SSMB29 Update.
మరోవైపు రాజమౌళి బృందం కెన్యా మంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. “గత రెండు దశాబ్దాలుగా రాజమౌళి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎంతో విజన్ కలిగిన వ్యక్తి. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన తర్వాత.. 120 మందితో కూడిన రాజమౌళి బృందం కెన్యాని ఎంచుకోవడం మాకు మరింత ఆనందంగా ఉంది. 100 కోట్ల మందికి పైగా చేరువయ్యే ఈ సినిమా 120 దేశాలలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా కెన్యాలో షూటింగ్ చేయడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని చూపించడంలో ఈ సినిమా శక్తివంతంగా పనిచేయనుంది. ముఖ్యంగా ఈ సినిమాతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది” అంటూ ఆయన తెలిపారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q