మోదీ తర్వాత స్థానంలో ఎన్టీఆర్.. తారక్ నయా రికార్డ్.!

Top 10 Indian Celebrities: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో ఒకరు హాట్ టాపిక్‌గా మారిపోతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, సినిమా తారలు, క్రికెటర్లు ఎక్కువగా చర్చల్లో ఉంటారు. ప్రతీ నెలా, ప్రతీ ఏడాదీ నెట్టింట ఎక్కువగా ప్రస్తావించబడిన ప్రముఖుల జాబితాను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (మాజీ ట్విట్టర్) విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా 2025 ఆగస్టు నెలకు సంబంధించిన మోస్ట్ టాక్‌డ్ ఇండియన్ సెలబ్రిటీలు టాప్-10 లిస్టును ప్రకటించింది.

ఈ తాజా జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, అంచనాలను మించిపోయేలా టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఒక సినీ నటుడు రాజకీయ నేతల్ని, క్రికెట్ లెజెండ్స్‌ను అధిగమించి టాప్-2లో నిలవడం సోషల్ మీడియాలో ఎంతటి డామినేషన్ చూపించాడో చెబుతుంది. ఎక్స్ విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం, ఆగస్టులో నెటిజన్లు అత్యధికంగా మోదీ, తారక్ గురించి మాట్లాడినట్లు తేలింది. మూడో స్థానాన్ని తమిళ స్టార్ విజయ్ దక్కించుకోగా, నాలుగో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఐదో స్థానాన్ని భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సొంతం చేసుకున్నారు.

తదుపరి స్థానాల్లో రాహుల్ గాంధీ (6వ స్థానం), విరాట్ కోహ్లీ (7వ స్థానం), టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (8వ స్థానం), ఎమెస్ ధోనీ (9వ స్థానం) నిలిచారు. చివరగా తలైవా రజనీకాంత్ 10వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. నెటిజన్లు ఆగస్టు నెలంతా ఎక్కువగా ఈ పదిమందిపై చర్చలు జరిపినట్టు ఎక్స్ వెల్లడించింది. ఈ లిస్టులో ఐదుగురు సినీ సెలబ్రిటీలు, ముగ్గురు క్రీడాకారులు, ఇద్దరు రాజకీయ నాయకులు ఉండటం గమనార్హం. ఆసక్తికర విషయమేమిటంటే – బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. టాలీవుడ్ నుంచి ముగ్గురు, కోలీవుడ్ నుంచి ఇద్దరు నటులు టాప్-10లో నిలిచారు. Top 10 Indian Celebrities.

గతేడాది RRR సినిమాతో గ్లోబల్ గుర్తింపు పొందిన తారక్, ఇటీవల దేవర అనే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించాడు. ఈ మధ్యే ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మీద నెటిజన్లలో భారీ ఆసక్తి నెలకొంది. అంతేకాదు, ఆగస్టు నెలలో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వార్ 2 విడుదల కావడం కూడా అతడి చర్చను మరింత పెంచింది. ఈ కారణంగానే ఆగస్టు నెలలో ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరగిందని చెప్పవచ్చు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q