
Koratala Siva and Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నాగ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చైతూ తో సినిమా కోసం కొరటాల ఏకంగా దేవర 2 ను కూడా పక్కకు పెట్టేశాడని టాలీవుడ్ అంతా కోడై కూసింది. దానికి తోడు, నాగచైతన్యతో రెండు మీటింగ్స్ జరగడంతో, ఆయన నాగచైతన్యతోనే సినిమా చేస్తున్నారని దాదాపు చాలా వరకు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ ప్రచారం పై ఓ క్లారిటీ వచ్చింది.
అక్కినేని వారసుడు నాగచైతన్య ఇటీవల ‘తండేల్’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదట్లో దేవర డైరెక్టర్ కొరటాల శివ తో నాగచైతన్య సినిమా చేస్తున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు అందులో నిజం లేదని తేలిపోయింది. అయితే, ఆయన నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ.. అయితే, అది దర్శకుడిగా కాదు. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి యువ సుధా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి, కొరటాల శివ సహకారంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొరటాల శివ ఒకరకంగా ఆ నిర్మాణ సంస్థలో భాగస్వామి అని చెప్పొచ్చు. ఆయన ఆ నిర్మాణ సంస్థ ద్వారా వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలతో భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన నాగచైతన్యతో భేటీ అయ్యారు. నాగచైతన్యతో మాత్రమే కాదు, పలువురు హీరోలతో కూడా ఆయన భేటీ అయ్యారు. అలాగే, పలువురు దర్శకులతో కూడా భేటీ అయ్యారు. ఇక్కడ ఆయన నాగచైతన్యతో సినిమా నిర్మాతగా చేయాలనుకుంటున్నారు, కానీ దర్శకుడిగా ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఏమైనా చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆయన నిర్మాతగానే సినిమా చేయాలనుకుంటున్నారట. Koratala Siva and Naga Chaitanya.
ఇక ప్రస్తుతం నాగ చైతన్య ‘విరుపాక్ష’ మూవీ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్క్షన్ లో సినిమా చేస్తున్నాడు. ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మైథికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చైతూ కి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాతే చైతూ 25 వ సినిమా దేవర నిర్మాతలతో ఉండనుంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q