జైలర్ 2 లో బాలీవుడ్ హీరోయిన్..!

Jailer 2 Vidya Balan: సూపర్ స్టార్ రజినీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో తెలిసిందే. అప్పటిదాకా వరుస ప్లాపులతో కొట్టు మిట్టాడుతున్న రజిని.. జైలర్ తో భారీ కంబ్యాక్ అందుకున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ 650 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏ సినిమాకి కొనసాగింపుగా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈసారి పార్ట్-1 ను మించేలా సర్ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ నెల్సన్. ఈ ప్రాజెక్ట్ లో ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా భాగం కానుందట.

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇటీవల ‘కూలీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు ఫర్వాలేదనిపించింది. రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లతో రజినీ స్టామినా ఏంటో నిరూపించింది. రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’లో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ ఫోకస్ అంతా ఇప్పుడు ‘జైలర్ 2’ మీదే ఉంది. గతంలో వచ్చిన ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లతో పాటు నందమూరి బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో ఏపీకి చెందిన పవర్‌ఫుల్ పోలీస్‌గా 10 నిమిషాల పాటు బాలయ్య కనిపించనున్నారట. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.22 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.

ఇక ‘జైలర్ 2’పై తలైవా ఫ్యాన్స్ భారీ హైప్‌తో ఉన్నారు. ఇందులో వచ్చే ట్విస్టులు, క్యామియో రోల్స్ గురించ వచ్చే వార్తల గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చతెరపైకి వచ్చింది. అదేంటంట.. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్రలో నటిస్తోందట. ఆమె రోల్ సినిమాకే కీలకం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా న్యూస్ మాత్రం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. Jailer 2 Vidya Balan.

దీంతో ఆమె ఎలాంటి పాత్రలో నటించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ న్యూస్ విన్న రజినీ ఫ్యాన్స్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అంటున్నారు. సూపర్ స్టార్ తో బాలీవుడ్ హీరోయిన్లు జతకట్టడం ఇదే మొదటిసారి కాదు. ఐశ్వర్య రాయ్, సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టే, హ్యూమా ఖురేషి లాంటి హీరోయిన్లు ఇప్పటికే రజినీకాంత్ సరసన నటించి మెప్పించారు. ఇప్పుడు ‘జైలర్ 2’ తో ఈ లిస్ట్ లో విద్య బాలన్ సైతం చేరనున్నారు. ఇక త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.