ఎన్టీఆర్ మాటల వెనకున్న మర్మం ఇదేనా..?

Secret behind NTR’s words: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇలా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించడంతో వార్ 2 మూవీ పై భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే.. ప్రమోషన్స్ లో వెనకబడిన వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో స్పీడు పెంచింది. అయితే.. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాటల వెనుక మర్మం ఉందని పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతకీ.. యంగ్ టైగర్ మాటల వెనకున్న మర్మం ఏంటి…?

వార్ 2 సినిమాతో పాటే కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుండడం తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పుతుందేమో అనుకున్నారు కానీ.. పోటీ తప్పడం లేదు. దీంతో సినీ అభిమానులే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీతో పోలీస్తే వార్ 2 బాగా వెనకబడింది. దీనికి కారణం.. ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం.. ఇది హిందీ సినిమా.. తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం అని చెప్పచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నన్ను ఎవరూ ఆపలేరు అన్నాడు. ఎన్టీఆర్ ఇలా మాట్లాడడం వెనుక మర్మ ఏంటంటే.. కూలీ సినిమాకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది. నారా లోకేష్ స్వయంగా కూలీ సినిమాని చూడండి ట్వీట్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. రజినీకాంత్ తో ఉన్న అనుబంధం నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియా, సోషల్ మీడియా కూడా కూలీ సినిమాకి ఉన్న హైప్ కి మించి లేపుతున్నారు. ఇక్క ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో నాగార్జున నటించారు. సాధారణంగా నాగార్జున సినిమాని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోరు కానీ.. కూలీ సినిమాని రజినీ సినిమాగా చూస్తూ మద్దతు ఇస్తుండడం విశేషం. Secret behind NTR’s words.

మొత్తానికి నారా లోకేష్‌ ట్వీట్ తో ఎన్టీఆర్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకనే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించని విధంగా ఫ్యాన్స్ పై కూడా ఎన్టీఆర్ ఫైర్ అయ్యాడు. సైలెంట్ గా ఉంటే.. ఉంటాను లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అంటూ ఫ్యాన్స్ పై సీరియస్ అవ్వడం ఎన్టీఆర్. ఈ సినిమాకి అంతగా బజ్ లేకపోవడం.. నారా లోకేష్ కూలీ సినిమాకి సపోర్ట్ చేస్తుండడం.. తదితర కారణాలతో తారక్ బాగా అప్ సెట్ అయ్యాడు అనిపిస్తుంది. అందుకనే.. నన్ను ఎవరూ ఆపలేరు అంటూ ఇన్ డైరెక్ట్ గా నారా లోకేష్‌ కి కౌంటర్ ఇచ్చాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈరకంగా నారా లోకేష్‌, ఎన్టీఆర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

Also Read: https://www.mega9tv.com/cinema/how-much-will-coolies-first-day-collection-coolie-collects-70-crores-in-advance-bookings/