
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో భారీగా క్రేజ్ ఉన్న సినిమా అంటే.. ఓజీ. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ మూవీకి సుజిత్ డైరెక్టర్. అయితే.. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. పవర్ స్టార్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఆల్రెడీ షూటింగ్ మధ్యలో ఉన్న వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయడానికే చాలా కష్టమౌతుంది. అలాంటిది ఓజీ పార్ట్ 2 ఉంటే.. అందులో పవర్ స్టార్ నటిస్తారా..? అనే డౌట్ వస్తుంది కానీ.. డైరెక్టర్ సుజిత్ మైండ్ లో ఓజీ 2 ప్లాన్ ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ లీక్. ఈ పార్ట్ 2 కూడా సరికొత్తగా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాడట సుజిత్. ఇంతకీ.. ఓజి 2 నిజంగా ఉందా..? అసలు సుజిత్ ప్లాన్ ఏంటి..?
ఓజీ 2 ఉందా అంటే.. ఉందనే మాట వినిపిస్తోంది. ఓజీ క్లైమాక్స్ లో దీనికి సంబంధించి హింట్ ఇస్తాడట. అయితే.. ఓజీ 2 లో పవర్ స్టార్ కనిపించడని.. కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తారని తెలిసింది. మరి.. ఓజీ 2 లో ఎవరు నటిస్తారంటే.. ఓజీలో కీలక పాత్రలు చాలా ఉంటాయట. ఒక్కొక్క పాత్ర చుట్టూ ఒక్కో కథ ఉంటుందట. అలా.. ఒక్కో పాత్రతో ఒక్కో సినిమాని రూపొందించాలి అనుకుంటున్నాడట సుజిత్. ఇంకా చెప్పాలంటే.. ఓజీని ఓ ఫ్రాంచైజీస్ లా.. ఓ వరల్డ్ గా మార్చే ఆలోచనలో సుజిత్ ఉన్నాడని తెలిసింది. ఇందులో పవన్ క్యారెక్టర్ కు ఓ గతం ఉంటుంది. అది ఏంటి అనేది ఓజీలో చూపించరట. పవన్ గతమే కథాంశంగా ప్రీక్వెల్ ప్లానింగ్ ఉందట.
అయితే.. ప్రీక్వెల్ చేస్తే.. పవనే చేయాలి. ప్రస్తుతం వపన్ కు ఉన్న కమిట్ మెంట్లు వలన ఆయన సినిమాలను తగ్గించుకోవలి అనుకుంటున్నారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓజీ ప్రీక్వెల్ పవన్ చేయకపోవచ్చు కానీ.. ఓజీ 2 లో మాత్రం గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి.. ఓజీ 2 లో కనిపించే హీరో ఎవరు అనేది క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.