
Hindupur SBI Bank Robbery: సినిమా రేంజ్ లో బ్యాంక్ ను కొల్లగొట్టరూ దొంగలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్ల.. విలువ చేసే బంగారాన్ని దర్జాగా దోచుకెళ్ళారు. పోలీసులకి సవాల్ గా మారిన బ్యాంక్ చోరీ.. నాలుగు రాష్ట్రాల్లో 8 బృందాలు దొంగల కోసం గాలింపులు.. 592 మంది ఖాతాదారుల్లో టెన్షన్ …. అసలు దొంగలు దొరుకుతారా.. లేదా..? అసలు ఇంత పెద్ద రాబరీ ఎక్కడ జరిగింది..? ఎలా జరిగింది.. ?
చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని రోజులు చేయాలి… కొడితే కుంభస్థలన్నీ కొట్టాలి అనుకున్నారేమో ఆ దొంగలు. ఏకంగా ఎస్బిఐ బ్యాంక్ ను టార్గెట్ చేసి.. 10 కోట్లు విలువ చేసే బంగారాన్ని దోచేశారు. హిందూపురం మండలం తూముకుంట చెక్పోస్ట్ లో ఉన్న ఎస్బిఐ బ్యాంకులో గత నెల 26న అర్ధరాత్రి బ్యాంకులో భారీ చోరీ జరిగింది. 592 మంది ఖాతాదారుల 10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తే పక్క ప్రొఫెషనల్ దొంగలు చేసిన విధంగా ఉందని గమనించారు. ఘటన స్థలంలో ఒక్క ఆధారం కూడా లేకుండా దొంగలు వ్యవహరించిన తీరు చూస్తే పోలీసులకు కూడా అవాక్క్ అయ్యారు.
దొంగలు అర్ధరాత్రి సమయం లో బ్యాంక్ వెనుక వైపుల ఉన్న కిటికీ గ్రిల్ ను కట్ చేసి బ్యాంక్ లోకి చొరబడ్డారు. బ్యాంక్ లోకి ప్రవేశించిన దొంగలు ముందుగా సిసిటీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఇక అందింనంతగా బంగారంతో ఉడాయించారు. బ్యాంక్ సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ వైపు ఈ కేసును త్వరగితిన పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతోంది. ఈ కేసును డీఐజీ శిమోషి, జిల్లా ఎస్పీ రత్న రోజు పర్యవేక్షిస్తున్నారు. చెక్ పోస్ట్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రధాన దారుల్లో సుమారు 40 కిలో మీటర్ల దూరం వరకు ఉన్న సీసీ కెమెరాలులను పూర్తిగా పరిశీలిస్తున్నారు పోలీసులు.
బ్యాంకు చోరీకి ముందు బ్యాంకు లోకి ఎవరైనా అనుమానితులు వచ్చి వెళ్లారా అనే కోణంలో పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో రాబరీని చేయాలంటే బ్యాంకు పై దొంగలు రెక్కీ నిర్వహిస్తే తప్ప చేయలేరని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజుల సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన ఈ తరహా కేసులను, పలు ప్రాంతాలను గుర్తించి అక్కడి పోలీసుల సూచనలు తిసుకున్నట్లు సమాచారం.
బ్యాంకు చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు రాష్ట్రాలకు ఎనిమిది బృందాలుగా పోలీసులు విడిపోయి దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. ఇందులో తమిళనాడు, ఢిల్లీ ,కర్ణాటక , అస్సాం రాష్ట్రాలలో దొంగల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో చోరీ చేసేందుకు వచ్చిన నిందితుడు అలారం వైర్లను కత్తరించే సమయంలో సిసి కెమెరాలు రికార్డ్ అయిన ఫోటోలను ఆధారంగా విచారణ స్పీడప్ చేశారు. అయితే ఇప్పటి వరకు చోరీలో ఎంతమంది పాల్గొన్నారు అన్న విషయం క్లారిటీకి రాలేదు. Hindupur SBI Bank Robbery.
ఈ కేసును తొందరగా చేదించాలని ఉన్నత అధికారుల ఒత్తిడితో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ఇంత పెద్ద మొత్తంలో రాబరీ జరగటం అది కూడా ఒక బ్యాంకులో జరగడం జిల్లా వ్యాప్తంగా ఇదే మొదటిసారి. చూడాలి మరి పోలీసులు ఈ కేసును ఎప్పటిలోపు చేదిస్తారో.