శ్రీ కోన రంగనాథ స్వామి దేవాలయ కథ..!

Sri Kona Ranganatha Swamy Temple: రమణీయ అందాలు.. పచ్చని కొండల మధ్య వెలసిన రంగనాయకుల స్వామి.. ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలలు.. జలపాతాల సవ్వడల రాగం  ఆలూరు కోన… ఆలూరు కోనలో వెలసిన రంగనాయకుల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

అనంతపురం జిల్లా తాడిపత్రికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి వెలసి ఉంటాడు. ఈ క్షేత్రం బుక్కరాయల కాలంలో ఎర్రమ తిమ్మరాజు అనే రాజు 14వ దశాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక ఆనవాళ్ళ ద్వారా తెలుస్తోంది. వేద భూమిగా చెప్పుకునే భారత దేశంలో అనేక దేవాలయాలు వెలసి ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో రంగనానాథ స్వామి దేవాలయం ఒకటి. 

పూర్వం విశ్వామిత్రు మహర్షి లోకకళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్న సమయంలో.. తాటకి మారీచుడు అనే రాక్షసుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నాడు అని తెలుసుకున్న విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వెళ్ళి దశరథ మహారాజు అంగీకారం మేరకు.. రామలక్ష్మణ లను ఈ దేవాలయం కి తీసుకువచ్చి యజ్ఞ రక్షకులుగా నియమించారు.

రంగనాథ స్వామి దేవాలయం 600 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. గర్భగుడిలో రంగనాథ స్వామి శేష పన్ప్పు పై భక్తులకు దర్శనమిస్తుంటాడు. స్వామివారి పాదాల చెంత భూదేవి,శ్రీదేవి కొలువుతీరుంటారు. కోరిన కోరికలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా భక్తులకు రంగనాథ స్వామి కొలువు దీరారు. మాములుగా శేషశయనంపై పవళించే శ్రీరంగనాధుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కాని ఈ క్షేత్రంలో శ్రీరంగనాధుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీరామానుజల వారికి గర్భగుడి నిర్మించారు.ప్రతి శనివారం, మంగళవారం ప్రత్యేక అలంకరణలతో దూప దీప నైవేద్యాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు. ప్రత్యేకించి భక్తులు స్వామివారికి ఆకు పూజ సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ప్రతి సంవత్సరమూ చైత్ర మాసంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం.  తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక రాష్ట్రములోని పలు చోట్ల నుండి కూడా వస్తారు. రంగనాథ స్వామి ఆలయం వెనకాల ఉన్న కొండల్లో బుగ్గ స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు. 

పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఆలూరు కోన రంగనాథ స్వామి దేవాలయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఎత్తైన కొండలు కొండలకు ఆకుపచ్చ చీర కట్టినట్టు ఉండే పచ్చదనం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆలయం వెనకాల కొండల్లో ఉన్న జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పెద్ద పెద్ద కొండలు, బండ రాళ్ల మధ్య పైనుంచి కిందకు నీళ్లు వస్తూ ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా జలపాతం లో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలూరు కోన ఒక పిక్నిక్ స్పాట్ లాగా తయారయింది. దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక గదులు వసతి  ఏర్పాటు చేసరూ.  Sri Kona Ranganatha Swamy Temple.

రంగనాథ స్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తామని భక్తులు తేలిపారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన మొట్టమొదటిగా రంగనాథ స్వామి దర్శనం అనంతరమే ప్రారంభమవుతుందని..  ప్రతి శనివారం లేదా నెలలో ఒకసారైనా దేవుడు దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు. రంగనాథ స్వామి ఎంతో విశిష్టత కలిగిన దేవుడని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తుల కోరికలను తీర్చే రంగనాథ స్వామి ఈ కొండపై వెలసడం ఎంతో అదృష్టమని తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారికి ప్రత్యేకమైన పుష్పయాగం చేస్తామని పూజారి వెల్లడించారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q