
Pushpa 2 Ganesh Mandap: వినాయక చవితి వేడుకల్లో సినిమాల ప్రభావం వేట కనిపిస్తూనే ఉంటుంది గతంలో బాహుబలి రోబో సినిమా సెటప్ తో వినాయక మండపాలు విగ్రహాల ఏర్పాటు చేసిన అభిమానులు ఈ ఏడాది కూడా తమ అభిమాన హీరోల సినిమాల సెటప్‌లతో వినాయక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని డెంకానియ కొట్టాయ్ లో వినాయక చవితికి పుష్ప 2 సినిమా సెటప్ తో వినాయక మండపం, విగ్రహం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
15 సంవత్సరాలకు పైగా, శ్రీ రాజా మార్తాండ భక్త మండలి సంస్థ తరపున కృష్ణగిరి జిల్లా హోసూర్ ప్రాంతంలో భారీ గణేశ విగ్రహాలను పూజించి ప్రతిష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతం తమిళం, తెలుగు, కన్నడ అనే మూడు భాషలు మాట్లాడే ప్రాంతం కాబట్టి, సినిమా దృశ్యాలను గుర్తుకు తెచ్చే విధంగా మరియు వాస్తవికంగా ఉండే విధంగా గణేశ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఏకంగా 30 లక్షలు ఖర్చుపెట్టి మండపాన్ని ఎర్రచందనం దుంగల ఆకృతిలో నిర్మించారు. ఎంట్రన్స్ లో హెలికాప్టర్ వద్ద గన్ తో ఉన్న పుష్పరాజ్ విగ్రహం పెట్టారు. లోపలికి వెళ్ళాక ఓ వైపున గంగమ్మ జాతర లో చీర కట్టులో ఉండే పుష్పరాజ్ ను తలపించేలా వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. క్లైమాక్స్ సీన్ లో అల్లు అర్జున్ చీర ధరించి త్రిశూలం చేత పట్టిన సీన్ తరహాలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. Pushpa 2 Ganesh Mandap.
బెంగళూరుకు చెందిన ప్రముఖ సినిమా సెట్ నిర్వాహకులు జితేంద్ర స్టూడియో సహాయంతో సుమారు రూ. 30 లక్షల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేశారు. ఇక 2018లో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన బాహుబలి, 2019లో అతివరధర్, 2022లో KGF, 2023లో గాంధార, 2024లో కల్కి వంటి భారతీయ హిట్ సినిమాల ఆధారంగా రూపొందించిన గణేశ విగ్రహాలను నిర్మించి పూజించారు. సినిమా అభిమానులతో పాటు భక్తులు కూడా ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q