
Donald Trump: డొనాల్డ్ సైకోలో ఒక రకరమైన మనస్తత్వం ఉంటుంది. అది మాటిమాటికీ బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. టారిఫ్‌లు పెంచుతూ.. రష్యాతో ఇంధన డీల్‌ను రద్దు చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ.. భారత్ మీద తన అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్.. సడన్ గా ఉన్నట్లుండి తన స్వరం మార్చారు. నిన్నటి వరకు కూడా భారత్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకి ట్రంప్ ఏమన్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. ఆయన ఎవరితో ఏం చేసినా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీని తన ఫ్రెండ్ అంటూనే.. మరోవైపు అంతర్జాతీయంగా ఇండియా పరువు తీస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు.. 50 శాతం టారిఫ్‌లు విధించి భారత దేశ విదేశాంగ వ్యాపార, వాణిజ్యాన్ని దెబ్బకొడుతూ.. ట్రంప్ చేస్తున్న చర్యలు.. ఇండియాకి ఎన్నో సమస్యలు తెస్తున్నాయి. అలాంటి ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకొని.. ప్రధాని మోదీని మెచ్చుకోవడం వెనక పెద్ద కుట్రే దాగి ఉంది.
ట్రంప్ రాజకీయ నేత మాత్రమే కాదు.. ఆయనో బిజినెస్‌మ్యాన్. కాబట్టి ఆయన ఏం చేసినా వ్యాపార కోణంలోనే చేస్తారు. దేశాలతో సంబంధాలు, నేతలతో స్నేహాలు అన్నింటి వెనకా మనీ మ్యాటర్సే ఉంటాయి. ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటే.. భారత్ తన ముందు తల వంచుతుంది అని ఆయన అనుకున్నారు. కానీ భారత్, రష్యావైపే చూడటంతో.. తన ప్లాన్ ఫలించలేదు అని భావించి.. ఇండియాపై భారీగా 50 శాతం సుంకాలు వేశారు. అప్పుడైనా భారత్ తనకు లొంగుతుంది అని అనుకున్నారు. కానీ.. ప్రధాని మోదీ తెలివిగా.. చైనా, రష్యాతో చేతులు కలిపారు. దాంతో ట్రంప్ వ్యూహం ఫలించలేదు.
రష్యా, భారత్, చైనా ఒక్కటైతే, అది అమెరికాకి అన్ని రకాలుగా నష్టమే. భారత్, అమెరికాకి దూరమైతే.. ఓ పెద్ద దేశాన్ని అమెరికా వదులుకున్నట్లు అవుతుంది. అది అన్ని రకాలుగా అమెరికాకి నష్టమే. భారత్‌కి కూడా నష్టమే. కానీ భారత్… చైనా లాంటి దేశాలతో కొత్త స్నేహాలను కలుపుకుంటూ.. నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. కానీ అమెరికాకి అలా కొత్త స్నేహాలు లేవు, ఉన్నవి కూడా పోతున్నాయి. అందుకే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. మోదీని మెచ్చుకోవడం ద్వారా.. తిరిగి భారత్‌కి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇదే అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం అంటే.
ట్రంప్ పన్నే ప్రతీ వ్యూహమూ ఆయనకే అనుకూలం తప్ప.. భారత్‌కి ఎలాంటి యూజ్ ఉండదు. పైగా.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. పాకిస్థాన్‌కి అన్ని రకాలుగా అండగా నిలిచారు. పాక్ ఆర్మీ చీఫ్‌ని రెండుసార్లు వైట్‌హౌస్‌కి పిలిపించుకొని.. పాకిస్థాన్‌ని మెచ్చుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్థాన్‌ని మెచ్చుకోవడం, భారత్‌పై రకరకాల విమర్శలు చేయడాన్ని గమనిస్తే, ట్రంప్ వైఖరి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారత్ చేజారిపోతోందని.. కాళ్ల బేరానికి వస్తున్నాడు ట్రంప్. Donald Trump.
మనతో మొదటి నుంచి రష్యా స్నేహంగా ఉంది. పాక్‌తో యుద్ధంలోనూ రష్యా మనకు అండగా నిలిచింది. మనకు మిస్సైల్ డిఫెన్స్ ఆయుధాలను అమ్మింది గానీ.. పాకిస్థాన్‌కి అమ్మలేదు. అమెరికా మాత్రం.. భారత్, పాకిస్థాన్ ఇద్దరికీ ఆయుధాలు అమ్ముతోంది. ఇలా ట్రంప్.. అమెరికా ప్రయోజనాలే చూసుకుంటారు తప్ప.. ఇండియా గురించి ఆలోచించే రకం కాదు. కాబట్టి.. ఆయన విషయంలో భారత్ కఠినంగా ఉండటమే మేలు. అప్పుడే ఆయన దిగివస్తారు. భారత్ ఇలాగే మొండిగా ఉంటే.. త్వరలోనే ఆయన టారిఫ్‌లను కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.