రాజకీయ అనిశ్చితి..!!

France PM Francois Bayrou: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి . ఇలాంటి సమయం లో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇంతకు అక్కడ ఎం జరిగింది తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ

దేశ రుణాన్ని తగ్గించడానికి సుమారు 52 బిలియన్లను తగ్గించాలనే ప్రణాళికలపై ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జాతీయ అసెంబ్లీ ఓటు వేసింది. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో 364 మంది డిప్యూటీలు ప్రభుత్వంపై తమకు అవిశ్వాసం లేదని ఓటు వేయగా.. కేవలం 194 మంది మాత్రమే తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో పదవీచ్యుతుడయ్యారు. దీంతో ఫ్రెంచ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఘోరంగా ఓటమి పాలైంది.

ప్రధానమంత్రి ఫ్రాన్సువా బేరూ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అనుకూలంగా 194 ఓట్లు రాగా..ప్రతికూలంగా 364 మంది ఓటేశారు. దీంతో ప్రధాన బేరూ..అధ్యక్షుడు మేక్రాన్ కు రాజీనామా ఇచ్చారు. బేరూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేటపట్టారు. ఈయన వయసు 74 ఏళ్ళు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం పడిపోవడంతో మరోసారి ఫ్రాన్స్ లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

ఫ్రాన్సువా బేరూ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని ముందు నుంచే అందరూ ఊహించారు. కానీ ఇంత ఘోరంగా ఓటమి పాలు అవుతారని ఎవరూ అనుకోలేదు. సొంత పార్టీలోనే చాలా మంది ఓటేయలేదని చెబుతున్నారు. బేరూ 44 బిలియన్ యూరోల పొదుపు పథకానికి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేయడమే దీనికి మెయిన్ కారణం అని తెలుస్తోంది. దాంతో పాటూ బడ్జెట్ సమస్యలు, ట్రంప్ టారిఫ్ లు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి లాంటివి ఫ్రాన్స్ గందరగోళ పరిస్థితులకు కారణంగా నిలిచాయి. రాజకీయ అనిశ్చితులకు కూడా ఇవే కారణమని అంటున్నారు.

అయితే ఇప్పుడు ప్రధాని బేరూ రాజీనామా, ప్రభుత్వం పడిపోవడం వలన ఈ సమస్యలేవీ వెంటనే పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఆ దేశం మీద ఉన్న రుణ భారం కూడా తొలగిపోదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం 3.3 ట్రిలియన్ల యూరోలు అప్పు కలిగి ఉంది. యూరోజోన్ లో గ్రీస్, ఇటలీ తర్వాత ఫ్రాన్స్ ఉంది. దీనికి తోడు అక్కడ వృద్ధులు బాగా పెరిగిపోయారు. పని చేసే వారు తక్కువ అయిపోయారు. దీని కోసం మాజీ ప్రధాన బేరూ వారానికి రెండు రోజుల సెలవు దినాలను కుదించారు. ఇది కూడా ఆయన ఓటమికి ఒక రీసన్ అనే చెప్పుకోవచ్చు.

ప్రధాని పదవికి బేరూ రాజీనామా చేసిన కొత్త వారు వచ్చేవరకూ ఆయనే కేర్ టేకర్ గా కొనసాగుతారు. వీరు రోజు వారీ వ్యవహారాలను మాత్రమే సమీక్షిస్తారు. కానీ దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలను మాత్రం తీసుకోలేరు. అయితే కొత్త ప్రధానిని నియమించడానికి ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రం ఇంకా తెలియదు. మరోవైపు అధ్యక్షుడు మాక్రాన్ రాజీనామాకు కూడా అక్కడ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. 2027 వరకూ తాను కొనసాగుతానని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే మాక్రాన్ సెంట్రిస్ట్ బ్లాక్ దారుణంగా ఓడిపోతుందని అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారనేది అసలు తెలియడం లేదు. France PM Francois Bayrou.

కేవలం తొమ్మిది నెలలు మాత్రమే బేరో ప్రధాని పదవిలో ఉన్నారు. పొదుపు బడ్జెట్‌పై విశ్వాస పరీక్షకు వెళ్లి లేనిపోని తంటా తెచ్చుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం.. ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో రాజీనామాను సమర్పించాలని స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ హయాంలో బేరౌ ఆరవ ప్రధానమంత్రిగా ఉన్నారు. తాజాగా బేరో ప్రభుత్వం కూలిపోవడంతో మాక్రాన్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధంపై తలమునకలవుతున్న తరుణంలో సంక్షోభం తలెత్తడంతో ఫ్రాన్స్‌లో గందరగోళం నెలకొంది. మరొక వారసుడిగా కోసం మాక్రాన్ వేట ప్రారంభించాల్సి వస్తోంది. రాజీ కుదరుస్తారా? లేదంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అన్నది సందిగ్ధం నెలకొంది. మరి ఎం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చుడాలిసిందే .