మరో యుద్ధం.?

America and Venezuela Conflict: కరేబియన్ సముద్రంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వైపు తాను శాంతి కార్మికుడినని ఏడు యుద్ధాలను ఆపానని నోబెల్ శాంతి బహుమతి కావాలని చెబుతూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం వెనుజుల్లా పై యుద్దానికి కాలు దువ్వుతున్నారు. అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు. ఈ రెండు దేశాల మద్య ఉద్రిక్తతలక కారణాలు ఏంటీ. యుద్ధం జరిగితే తలెత్తే పరిణామాలు ఏంటీ. ఈ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, చమురు సంపన్న దేశం వెనిజులా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారని అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరిహద్దుల్లో ఫైటర్ జెట్ల మోహరింపుతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికార పీఠం నుంచి దించివేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం, ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్య దిశగా మళ్లుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక ఏ క్షణమైనా వెనుజుల్లా పై దాడి చేసేందుకు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకే తాను ఈ పని చేస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు. కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు జలాంతర గ్రాములు, అత్యాధునక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధనౌకలు కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 12 జలాంతర్గాములు, 150 ఫైటర్ జెట్ లు 1200 క్షిపణులతో సహా భారీ సైనిక శక్తిని వెనుజుల సమీపంలో ఉంచింది అమెరికా. పదుల సంఖ్యలో F35 యుద్ధవిమానాలు ఫ్యూర్టోరిక్ స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P 8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనుజులాపై దాడులు చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

వెనుజులా నుంచి తమ దేశానికి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని దీని వెనుక ఆ దేశ అధ్యక్షుడు ఉన్నాడని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తుంది. దీనికి చెక్ పెట్టాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు. 2020 లో అమెరికా ప్రభుత్వం ఆపరేషన్ కౌంటర్ నార్కోటిక్స్ పేరుతో వెనుజులా తీరంలో సైనికా ఆపరేషన్ ను ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు మాడ్యురోను డ్రగ్ కింగ్ పిన్ గా ఆరోపించారు. అమెరికా న్యాయశాఖ మాడ్యుర పై డ్రగ్ ట్రాకింగ్ ఆరోపణలు చేసింది. మాడ్యురో కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారని కొకైన్ అమెరికా రవాణా చేస్తున్నారని ఆరోపించింది. ఇక మాడ్యురో ఆచూకి తెలిపితే 50 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ ఆరోపణలకు బలమైన ఆధారాల లేవని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి వెనుజులా ఒక ట్రాన్సిక్ హబ్ గా మాత్రమే ఉంటుంది. అమెరికాకు వెనుజులా కంటే కొలంబియా , మెక్సికో నుంచి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అమెరికా వెనుజుల ఉద్రిక్తతలు కొత్తమే కాదు. గతంలో కూడా చాలా సార్లు ఉద్రిక్తత పరిస్తితులు తలెత్తాయి. 1999లో హ్యూగ్ చావెజ్ ఎన్నికనప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సబంధాల బిడిసి కొట్టాయి. చావెజ్ సోషలిస్ట్ విధానాలు చమురు పరిశ్రమను జాతీయం చేయడం అమెరికాకు నచ్చలేదు. 2013లో చావెజ్ మరణించిన తర్వాత నికోలస్ మాడ్యురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మాడ్యురో అధ్యక్షుడు అయ్యాక అమెరికాతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మాడ్యురోను అసలు అధ్యక్షుడిగా గుర్తించడం లేదు అమెరికా.

వెనుజులా తమ దేశంలో డ్రగ్స్ పంపిస్తుందని అందుకే ఆ దేశం పై దాడి చేస్తున్నామని అమెరికా చెబుతోంది. అయితే డ్రగ్స్ అనేది ఒక సాకు మాత్రమే అని దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. అమెరికాకు వెనుజులా సమస్యగా మారింది. అందుకే ఆదేశాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇందుకు అనేక కారణాల ఉన్నాయి. వెనుజులా వద్ద 300 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. అమెరికా చమురు కంపెనీలు అయినా షవరాన్, ఎక్స్ ఆన్ మదిల్ ***ఈ చమరు పై కన్నేశాయి. మాడ్యురో ప్రభుత్వం ఈ కంపెనీలక అనుమతి రద్దు చేసింది. దీంతో అమెరికా ఫైర్ మీద ఉంది. మరోవైపు మాడ్యురో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరిస్తుంది. ఇది అమెరికా ఆదిపత్యానికి వ్యతిరేకం. వెనుజులాక చైనా , రష్యా మద్దతుగా ఉన్నాయి. చైనా 212 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. రష్యా సైనిక సహకారం అందిస్తుంది. ఇక్కడ ఈ దేశాల ప్రభావాన్ని తగ్గించాలని అమెరికా అనుకుంటోంది.

వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో అమెరికాకు పెద్ద సమస్యగానే మారారు. ఆయన్ని తప్పించి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ట్రంప్ ఆలోచన. 2018లో మార్యురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అమెరికా సహా 50కి పైగా దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మాడ్యురో 67.8 శాతం ఓట్లతో గెలిచారు. కానీ ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విపక్ష నాయకులను బెదిరించారని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తుంది. అందుకే మాడ్యురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదు. అతనిని చట్ట విరుద్ధంగా ప్రకటించి విపక్షనాయకుడు జువాన్ గ్వైడోను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించింది. గ్వైడోకు అమెరికా యూరోపియన్ మద్దతు ఇచ్చింది. కానీ ఆయన ప్రభావం వెనుజులాలో తగ్గిపోయింది. మాడ్యురో మాత్రం తన ఎన్నిక చట్టబద్దమని అమెరికా సైతం వెనుజులా సార్వభౌమత్వానికి వాదిస్తున్నారు. చైనా, రష్యా, క్యుబా, టర్కీ వంటి దేశాలు మాడ్యురోకు మద్దతు ఇస్తున్నాయి.

ప్రస్తుతం తమ దేశంపై అమెరికా సైనిక చర్యలు చేపడితే తాము చూస్తూ ఊరుకోమని వెనుజులా హెచ్చరిస్తుంది. తామ కూడా యుద్దానికి సిద్ధమే అని చెబుతోంది. అమెరికా సైనిక చర్యలపై వెనుజులా గట్టిగానే స్పందించింది. అమెరికా తమ చమురును దోచుకోవాలను కుంటుందని మా సార్వౌభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తాము కూడా యుద్దానికి సిద్ధమవుతున్నామని సైనికులను మొహరిస్తున్నామని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా చర్యలను వెనుజులా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని దుయ్య బట్టింది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే రష్యా చైనా సహకరించాలని వెనుజులా కోరుతోంది. America and Venezuela Conflict.

ఒకవేళ అమెరికా , వెనుజులా యుద్ధం జరిగితే అంతర్జాతీయ పరిణామాలు మారే ఛాన్స్ ఉంది. ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కాకపోవచ్చు. అమెరికా వెనుజులా యుద్ధం జరిగితే లాటిన్ అమెరికా పై అధిక ప్రభావం ఉండొచ్చు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుంట పడే ప్రమాదం ఉంది. వెనుజులా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. 2014 నుంచి 70 లక్షల మంది దేశం విడిచి వెళ్లారు. యుద్ధం జరిగితే వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో వెనెజులా 3 శాతం వాటా కలిగి ఉంది. యుద్ధం వల్ల చమురు ఉత్పత్తి ఆగిపోతే చమురు ధరల ఆకాశానికి ఎగబాకవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. చైనా, రష్యా వెనుజులాకు మద్దతు ఇస్తున్నాయి. రష్యా ఇప్పటికే వెనుజులాకు S300 క్షిపణి వ్యవస్థలు, సుఖోయ్ ఫైటర్ జెట్ లు సరఫరా చేస్తుంది. యుద్ధం జరిగితే ఈ దేశాలు జోక్యం చేసుకోవచ్చు. ఇక ఇది ప్రపంచ యుద్ధంలా మారే ప్రమాదం ఉంది.