నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా రాహుల్ పై ఈడీ!

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా, రాహుల్ గాంధీల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ జరుగుతున్న వాదనల్లో కీలక విషయాలు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ ద్వారా మనీల్యాండరింగ్ చేశారని సోనియా, రాహుల్ మీద ఆరోపణ చేసింది.

142 కోట్ల రూపాయల ఆదాయాన్ని సోనియా, రాహుల్ వాడుకున్నారని తెలిపింది. అలాగే ఆదాయాన్న దగ్గర ఉంచుకోవడం కూడా మనీ ల్యాండరింగ్ అవుతుందని స్పష్టం చేసిన ఈడీ, షేర్ హోల్డర్లను కూడా మోసం చేశారని ఆరోపించింది.