ఇక పాకిస్థాన్, చైనాకు గుండెల్లో దడే…!

Indian Advanced Missiles: ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక్కసారిగా గేర్ మార్చింది. 200 కిలోమీటర్లకు మించి స్ట్రైక్ చేయగల లాంగ్-రేంజ్ మిస్సైళ్లను తన అమ్ముల పొదిలో చేర్చడానికి పూర్తి ఫోకస్ పెట్టింది. శత్రువుల రేంజ్‌కు అందకుండా, సేఫ్ ప్లేస్ నుంచి దెబ్బతీయడం ఇప్పుడు IAFవ్యూహం. బ్రహ్మోస్ లాంటి ఆధునిక మిస్సైళ్లతో ఆపరేషన్ సింధూర్‌లో చూపిన సత్తా, ఇప్పుడు భారత వైమానిక దళాన్ని ప్రపంచంలోనే టాప్ ఫైటర్ ఫోర్స్‌గా నిలబెట్టింది. చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను తల్లకిందులు చేస్తూ, IAF కొత్త టెక్ శక్తితో దూసుకెళ్తోంది. అందులో భాగంగా కొత్త అప్ గ్రేడ్ వర్షన్ మిస్సైల్స్ రెడీ అవుతున్నాయి.. ఇంతకీ ఎయిర్ ఫోర్స్ కు త్వరలో రాబోతున్న కొత్త అప్ గ్రేడ్ వర్షన్ మిస్సైల్స్ ఏంటి..? వాటి ప్రత్యేకత ఏంటి..? లాంగ్ రేంజ్ మిస్సైల్స్ పైనే ఎక్కువగా ఎందుకు ఫోకస్ పెట్టారు..?

ఆపరేషన్ సింధూర్‌ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక్కసారిగా తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. బ్రహ్మోస్, స్కల్ప్, ర్యాంపేజ్, క్రిస్టల్ మేజ్ లాంటి లాంగ్-రేంజ్ మిస్సైళ్లను వాడి, 250 నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు ఎయిర్ బేస్‌లు, స్ట్రాటెజిక్ లొకేషన్స్‌ను ఒక్క దెబ్బతో నాశనం చేసింది. చైనా HQ-9, పాకిస్తాన్ HQ-16 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నా, IAF ఈ మిస్సైళ్లతో వాటిని అసలు తాకకుండానే టార్గెట్స్‌ను ఖతం చేసింది. ఈ ఆపరేషన్‌లో డమ్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హరోప్ డ్రోన్స్, లోయిటరింగ్ మ్యూనిషన్స్ వాడి, శత్రువు రాడార్‌లను గందరగోళంలో పడేసి, ఖచ్చితమైన స్ట్రైక్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్‌ను పూర్తిగా తుడిచిపెట్టింది. ఈ విజయం IAF టెక్నాలజీ, స్ట్రాటెజీలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది.

ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత, IAF ఇప్పుడు లాంగ్-రేంజ్ ఎయిర్-టు-గ్రౌండ్, ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లను సేనలో చేర్చడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ తో కలిసి, స్వదేశీ ఆస్త్రా ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌ను 200 కిలోమీటర్లకు మించి స్ట్రైక్ చేయగల వేరియంట్‌గా అభివృద్ధి చేయమని కోరింది. అదే సమయంలో, రష్యా నుంచి R-37, BM-04 లాంటి అత్యాధునిక మిస్సైళ్లను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. ఈ మిస్సైళ్లు పశ్చిమ సరిహద్దుల్లో, ఉత్తర సరిహద్దుల్లో అంటే పాకిస్థాన్, చైనా బోర్డర్లలో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను, రాడార్ సిస్టమ్స్‌ను దూరం నుంచే టార్గెట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ కొత్త వ్యూహంతో IAF తన టాక్టికల్ ఎడ్జ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది, శత్రువు డిఫెన్స్ సిస్టమ్స్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

ఆపరేషన్ సింధూర్‌లో IAF తన S-400 సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌తో చరిత్ర సృష్టించింది. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ సర్వైలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో ఖతం చేసింది. ఈ లాంగ్-రేంజ్ దాడి గ్లోబల్ రికార్డ్‌గా నిలిచింది, S-400 సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఈ సిస్టమ్ ఉనికి వల్ల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ సర్వైలెన్స్ ఫ్లైట్స్‌ను భారత సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలోనే నడపాల్సి వచ్చింది. అంటే, వాళ్ల రాడార్, సర్వైలెన్స్ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. పాకిస్తాన్ విమానాలు లో-ఆల్టిట్యూడ్‌లో ఎగరడం లేదా తమ టెరిటరీలోనే ఉండిపోవడం వంటి రక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ S-400 సిస్టమ్ భారత్‌కు ఒక ఫైర్‌వాల్‌లా పనిచేస్తూ, శత్రు విమానాలను దూరంగా ఉంచుతోంది.

ఆపరేషన్ సింధూర్‌లో IAF ఒక అద్భుతమైన స్ట్రాటెజీతో పాకిస్తాన్, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను తల్లకిందులు చేసింది. పాకిస్తాన్ HQ-9, HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను డమ్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హరోప్ డ్రోన్స్, లోయిటరింగ్ మ్యూనిషన్స్‌తో జామింగ్ చేసి, వాటి పొజిషన్స్‌ను గుర్తించింది. ఆ తర్వాత బ్రహ్మోస్, స్కల్ప్, ర్యాంపేజ్, క్రిస్టల్ మేజ్ మిస్సైళ్లతో ఖచ్చితమైన స్ట్రైక్స్ చేసి, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్, కమాండ్ సెంటర్స్‌ను పూర్తిగా నాశనం చేసింది. ఈ ఆపరేషన్‌లో IAF సాంకేతిక, వ్యూహాత్మక సామర్థ్యం ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. భారత వైమానిక దళం ఇప్పుడు ఏ శత్రువు డిఫెన్స్ సిస్టమ్‌నైనా దూరం నుంచి ధ్వంసం చేయగలదని రుజువు చేసింది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడితో ఆగిపోలేదు.. ఈ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. దీని కోసం ఉన్న మిస్సైల్స్ ను అప్ గ్రేడ్ చేయిస్తోంది.

IAF ఇప్పుడు DRDOతో కలిసి ప్రాజెక్ట్ కుశ ద్వారా లాంగ్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారత్‌కు స్వదేశీ లాంగ్-రేంజ్ డిఫెన్స్ సామర్థ్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో, స్వదేశీ ఆస్త్రా మిస్సైల్‌ను 200 కిలోమీటర్లకు మించి స్ట్రైక్ చేయగల వేరియంట్‌గా అప్‌గ్రేడ్ చేసే పనిలో DRDO ఉంది. రష్యా నుంచి R-37 మిస్సైళ్లను కొనుగోలు చేసే ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. అదనంగా, S-400 సిస్టమ్ మరో రెండు స్క్వాడ్రన్స్‌ను సేనలో చేర్చే ప్లాన్‌లో ఉంది, ఇది రష్యా తయారీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త మిస్సైళ్లు, సిస్టమ్స్‌తో IAF సరిహద్దు ప్రాంతాల్లో సుపీరియర్ డిటరెన్స్ కెపాసిటీని సాధించనుంది. భవిష్యత్తులో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్స్, రాడార్ సిస్టమ్స్‌ను దూరం నుంచే నాశనం చేయడానికి ఈ సామర్థ్యం IAFకి భారీ బలాన్ని ఇస్తుంది. Indian Advanced Missiles.

ఈ కొత్త లాంగ్-రేంజ్ మిస్సైళ్లు, S-400 సిస్టమ్స్, ప్రాజెక్ట్ కుశ, ఆస్త్రా అప్‌గ్రేడ్స్‌తో IAF ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. రాఫెల్, SU-30 MKI లాంటి ఫైటర్ జెట్స్‌పై ఈ మిస్సైళ్లను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, IAF స్టాండ్-ఆఫ్ స్ట్రైక్ కెపాసిటీ భారీగా పెరుగుతుంది. శత్రువుల ఎయిర్ బేస్‌లు, రాడార్ స్టేషన్స్, కమాండ్ సెంటర్స్, UAV సెంటర్స్‌ను దూరం నుంచే ధ్వంసం చేయగల సామర్థ్యం ఇప్పుడు IAFకి అందుబాటులోకి వస్తుంది. ఈ టెక్నాలజీ, వ్యూహాత్మక మార్పులతో భారత్ రీజనల్ ఎయిర్ సుపీరియారిటీని సాధించడం ఖాయం. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే ఏ ఎయిర్ థ్రెట్‌నైనా IAF ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొనే స్థితిలో ఉంది. ఈ కొత్త సామర్థ్యాలు భారత వైమానిక దళాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఫోర్స్‌గా నిలబెడతాయి.

Also Read: https://www.mega9tv.com/national/will-the-price-of-gold-double-in-five-years-will-gold-prices-increase-with-trumps-decision/