పాకిస్థాన్ కు ధడ పుట్టిస్తోన్న భారత్ ప్రయోగం..!

Indian Defence Air System: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్.. వారానికో ప్రయోగం.. రోజుకో రక్షణ అంశంపై చర్చతో శత్రుదేశానికి ఒణుకు పుట్టిస్తోంది. తోక జాడిస్తే భారత్ ఎల్లప్పుడూ పోరుకు సిద్ధంగా ఉంటుందని రజువు చేస్తోంది. దీని కోసమే తన రక్షణ సామర్థ్యాన్ని తరుచూ పరీక్షిస్తోంది. తాజాగా DRDO ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ -IADWS మొదటి ఫ్లైట్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది, దీన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో గర్వంగా పోస్ట్ చేశారు అసలు IADWS అంటే ఏమిటి? ఇది రష్యా S-400 కంటే గొప్పదా? భారత్ సొంతంగా తయారు చేస్తోన్న ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ ఎలా పనిచేస్తుంది? పాకిస్తాన్ , చైనా తయారీ రక్షణ వ్యవస్థలు భారత్ ముందు ఎందుకు నిలవలేకపోతున్నాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ -IADWS అనేది భారత్ స్వదేశీ తయారీ, బహుళ-స్థాయి వైమానిక రక్షణ వ్యవస్థ, ఇది ఒక ఆల్-ఇన్-వన్ రక్షణ గొడుగులా పనిచేస్తుంది. లాంగ్ రేంజ్ నుంచి షార్ట్ రేంజ్ వరకు, శత్రువు డ్రోన్‌లు, బాలిస్టిక్ మిస్సైల్స్, ఫైటర్ జెట్‌లు ఇది వచ్చినా సరే ఈ వ్యవస్థ సెకన్లలో గుర్తించి, ట్రాక్ చేసి, నాశనం చేయగలదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ మిసైల్స్, డ్రోన్స్ ను మిక్స్ చేస్తూ భారత్ పై ప్రయోగించింది. దీని వల్ల పెద్ద ప్రమాదం.. దేనీ వల్ల చిన్న ప్రమాదమో గుర్తించి దానికి తగ్గట్టు నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నదే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. దీని సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆటోమేటెడ్ వ్యవస్థ, ప్రమాద స్థాయిని అంచనా వేసి, తక్షణం రీ-కాలిక్యులేషన్ చేసి, అత్యంత సమర్థవంతంగా దాడిని నిర్వీర్యం చేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO శాస్త్రవేత్తలను అభినందించారు, దీన్ని భారత రక్షణ రంగంలో స్వదేశీ టెక్నాలజీకి గొప్ప విజయంగా పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ డిఫెన్స్ సిస్టమ్స్ పై ఫోకస్ ఎందుకు పెంచింది..?
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ గగనతల రక్షణ వ్యవస్థలపై దృష్టి సారించడం గణనీయంగా పెరిగింది. గతంలో విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన భారత్, సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదులు డ్రోన్‌లు, అధునాతన ఆయుధాలను ఉపయోగించడం, ఆకస్మిక మిస్సైల్ దాడుల పెరుగుదల వంటి సవాళ్లతో స్వదేశీ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, IADWS వంటి వ్యవస్థలు భారత ఎయిర్‌స్పేస్‌ను అజేయంగా మార్చడానికి కీలకమవుతున్నాయి. ఈ వ్యవస్థలు రాడార్లు, సెన్సార్లు, ఇంటర్‌సెప్టర్లతో క్షణాల్లో అలర్ట్ అవుతాయి, శత్రు చొరబాటును తక్షణం నిర్వీర్యం చేస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవ రోజున మోడీ, సుదర్శన చక్ర వంటి స్వదేశీ వ్యవస్థలు భారత్‌ను ప్రపంచ సైనిక శక్తిగా నిలబెడతాయని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ దిశగా, DRDO స్వదేశీ ప్రయోగాలు భారత రక్షణ ఘనతను ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

S-400, IADWS మధ్య తేడా ఏమిటి?
రష్యా తయారీ S-400 ఒక అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైటర్ జెట్‌లు, బాలిస్టిక్ మిస్సైల్స్, UAVలను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీని ఫోర్ స్టేజ్ ప్రొటెక్షన్, బలమైన ట్రాకింగ్ సామర్థ్యాలు దీన్ని ప్రపంచంలోనే టాప్ డిఫెన్స్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. అయితే, IADWS భారత్ స్వదేశీ తయారీ వ్యవస్థ, ఇది భారత అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని మాడ్యులర్ డిజైన్ కొత్త థ్రెట్‌లకు అనుగుణంగా సులభంగా అప్‌గ్రేడ్ లేదా రీప్లేస్ చేయగల సౌలభ్యాన్ని అందిస్తుంది. ట్రాకింగ్, ఫైర్ కంట్రోల్, మొబైల్ వర్సటిలిటీ, డిస్ట్రిబ్యూటెడ్ కమాండ్ సిస్టమ్‌తో IADWS భారత రక్షణ వ్యవస్థలో ఒక విశిష్టమైన ఆయుధంగా నిలుస్తోంది. S-400 ఒక శక్తివంతమైన విదేశీ సిస్టమ్ అయినప్పటికీ, IADWS స్వదేశీ సామర్థ్యం, భారత్ ఆత్మనిర్భరతను ప్రతిబింబిస్తూ, దేశ రక్షణ ఘనతను మరింత ఉన్నతంగా నిలబెడుతోంది.

భారత్ అభివృద్ధి చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏంటి..?
భారత్ రక్షణ రంగంలో స్వదేశీ టెక్నాలజీని బలోపేతం చేస్తూ, అనేక అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో QRSAM తక్షణ స్పందన కోసం రూపొందినది, ఇది శత్రువుల ఆయుధాలను వేగంగా నాశనం చేయగలదు. ఆకాష్, ఆకాష్ -NG మధ్య రేంజ్ రక్షణ కోసం అభివృద్ధి చేయబడ్డాయి, ఇవి అధునాతన ట్రాకింగ్, ఇంటర్‌సెప్షన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. XRSAM భవిష్యత్తులో లాంగ్ రేంజ్ రక్షణ కోసం ప్లాన్ చేయబడింది. ఇజ్రాయెల్‌తో కలిసి అభివృద్ధి చేసిన MR-SAM మీడియం రేంజ్ థ్రెట్‌లను ఎదుర్కొనేందుకు రూపొందింది. అలాగే, న్యూ-జనరేషన్ రాడార్లు, సెన్సార్లు డ్రోన్ స్వార్మ్‌లను కూడా గుర్తించి, దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్నీ స్వదేశీ ఆటోమేషన్ మాడ్యూల్స్‌తో డిజైన్ చేయబడుతున్నాయి, ఇవి భారత రక్షణ సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయి.

IADWS ఎలా పనిచేస్తుంది?
ఆపరేషన్ సిందూర్ వంటి ఉద్రిక్త సమయాల్లో IADWS వంటి వ్యవస్థలు భారత ఎయిర్‌స్పేస్‌ను అత్యంత సమర్థవంతంగా రక్షిస్తాయి. శత్రువు నుంచి ఆకస్మిక దాడులు అంటే.. డ్రోన్, మిస్సైల్, లేదా ఫైటర్ జెట్ తో దాడి జరిగినప్పుడు, IADWS సెన్సార్ నోడ్స్, మార్-అల్గారిదమ్ ఆధారంగా థ్రెట్‌ను తక్షణం గుర్తిస్తాయి. సమీపంలోని ఇంటర్‌సెప్టర్ యాక్టివేట్ అవుతుంది, దాడి జరిగిన ఏరియా ఆధారంగా జోన్‌వారీగా సిస్టమ్ స్పందిస్తుంది. స్థానిక రాడార్లు తక్షణ ఫీడ్‌బ్యాక్ అందిస్తాయి, హ్యూమన్ ఎర్రర్ లేకుండా మెషిన్ ఆధారిత షట్‌డౌన్ లేదా నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ వ్యవస్థ వేగం, ఖచ్చితత్వం, ఆటోమేషన్ సామర్థ్యాలు భారత రక్షణ వ్యవస్థను అజేయంగా నిలబెట్టనున్నాయి.

భారత్ ముందు పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిస్థితి ఏంటి?
పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ముఖ్యంగా చైనా తయారీ HQ-9, LY-80 వంటి సిస్టమ్స్, భారత స్వదేశీ IADWS, Akash-NG, QRSAM వంటి అధునాతన వ్యవస్థల ముందు చాలా వెనుకబడి ఉన్నాయి. HQ-9 ఒక లాంగ్ రేంజ్ సిస్టమ్ అయినప్పటికీ, దీని ట్రాకింగ్, ఇంటర్‌సెప్షన్ సామర్థ్యాలు IADWS ఆటోమేటెడ్, మాడ్యులర్ డిజైన్‌తో పోల్చినప్పుడు సామర్థ్యం తక్కువ. చైనా సిస్టమ్స్‌లో ఇంటిగ్రేషన్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ సౌలభ్యం పరిమితంగా ఉంటుంది, అయితే IADWS భారత్ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా, స్వదేశీ సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయగల సౌలభ్యాన్ని కలిగి ఉంది. పాకిస్తాన్ LY-80 మీడియం రేంజ్ సిస్టమ్, ఇది డ్రోన్ స్వార్మ్‌లు, అధునాతన ఫైటర్ జెట్‌లను ఎదుర్కొనేందుకు తగినంత సామర్థ్యం లేకపోవడం, దాని రాడార్ రేంజ్, ట్రాకింగ్ ఖచ్చితత్వం పరిమితులతో సతమతమవుతోంది. భారత్ IADWS, QRSAM వంటి వ్యవస్థలు అధునాతన సెన్సార్లు, డిస్ట్రిబ్యూటెడ్ కమాండ్ సిస్టమ్‌లతో శత్రు థ్రెట్‌లను సమర్థవంతంగా నిర్వీర్యం చేస్తాయి. భారత్ స్వదేశీ టెక్నాలజీ, ఆటోమేషన్, మాడ్యులర్ సామర్థ్యాలు పాకిస్తాన్ చైనా తయారీ సిస్టమ్స్‌ను దూరంగా వెనక్కి నెట్టాయి, భారత రక్షణ శక్తి యొక్క ఆధిపత్యాన్ని చాటిచెబుతున్నాయి. Indian Air Defence System.

భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ప్రపంచ స్థాయి రక్షణ శక్తులైన అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలతో సమానంగా ఎదురొడ్డి నిలుస్తున్నాయి. IADWS, Akash-NG, QRSAM వంటి స్వదేశీ వ్యవస్థలు స్మార్ట్ ఆటోమేషన్, నెట్‌వర్క్ సామర్థ్యాలతో, విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా భారత రక్షణ రంగాన్ని అజేయంగా తీర్చిదిద్దుతున్నాయి. DRDO వినూత్న ప్రయోగాలు, స్వదేశీ డిజైన్‌లు భారత ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. పాకిస్తాన్ చైనా తయారీ వ్యవస్థలు భారత్ అధునాతన సాంకేతికత, ఖచ్చితత్వం, వేగం ముందు ఏమాత్రం నిలవలేకపోతున్నాయి.