మరో కీలక ప్రయోగానికి సిద్ధవుతోన్న ఇస్రో..!

ISRO & NASA: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ సారి ఇస్రో నాసాతో కలిసి ఈ ప్రయోగం చేపడుతోంది. దీనికి GSLV రాకెట్ ను ఉపయోగిస్తున్నారు. అంటే ఈ ప్రయోగం ఎంత పెద్దతో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రయోగం ఏంటి..? ఇస్రో.. నాసా సహకారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..? GSLV ద్వారా నింగిలోకి పంపే ఉపగ్రహం వల్ల మనకు కలిగే లాభం ఏంటి..?

అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. నాసా సహకారంతో నాసా -ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్.. షార్ట్ కట్ లో నిసార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ నెల 30 సాయంత్రం 5:40 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో జిఎస్‌ఎల్‌వి-ఎఫ్16 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం బరువు 2,392 కిలోలు, దీనిని 743 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. నిసార్ మిషన్ మూడు సంవత్సరాల పాటు పనిచేయడానికి రూపొందించబడింది. అయితే దీని ఇంధన సామర్థ్యం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఉపగ్రహం 240 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 5 నుంచి 10 మీటర్ల రిజల్యూషన్‌తో స్కాన్ చేయగలదు.

నిసార్ కోసం జీఎస్ఎల్వీ రాకెట్ నే ఎందుకు వాడుతున్నారు. ?
నిసార్ ఉపగ్రహం బరువు 2,392 కిలోగ్రాములు. అంటే పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించడం కష్టం. పీఎస్‌ఎల్వీ రాకెట్ 1,750 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే మోసకెళ్లదు. అలాగే సన్-సింక్రోనస్ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలంటే పీఎస్ఎల్వీ సామర్థ్యం సరిపోదు. అందుకే జీఎస్‌ఎల్‌వి-ఎఫ్16 రాకెట్ ఎంచుకోబడింది, ఇది 5,000 కిలోల వరకు తక్కువ భూ కక్ష్య వరకు, 2,500 కిలోల వరకు జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ కక్ష్య వరకు ఉపగ్రహాలను మోసుకెళ్లగలదు. అలాగే జిఎస్‌ఎల్‌వి మార్క్ II రాకెట్‌లో క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్ కూడా ఉంది. 2024 నుంచి దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ అనుకూలమైన, తేలికైన మెటీరియల్స్‌తో తయారు చేయబడింది. జిఎస్‌ఎల్‌వి గతంలో కొన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవలి విజయాలు దీని విశ్వసనీయతను పెంచాయి. నిసార్ వంటి భారీ, అత్యంత ముఖ్యమైన ఉపగ్రహాలకు జీఎస్‌ఎల్‌వి రాకెట్ ఎంతో నమ్మకమైంది. ISRO & NASA.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ సారి ఇస్రో నాసాతో కలిసి ఈ ప్రయోగం చేపడుతోంది. దీనికి GSLV రాకెట్ ను ఉపయోగిస్తున్నారు. అంటే ఈ ప్రయోగం ఎంత పెద్దతో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రయోగం ఏంటి..? ఇస్రో.. నాసా సహకారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..? GSLV ద్వారా నింగిలోకి పంపే ఉపగ్రహం వల్ల మనకు కలిగే లాభం ఏంటి..?.

నిసార్ ఉపగ్రహం భూమి ఉపరితల మార్పులను, సంక్లిష్టమైన సహజ ప్రక్రియలను పరిశీలించడానికి రూపొందించబడింది. ఈ ఉపగ్రహం రెండు రాడార్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకుని పనిచేస్తుంది. దీనిలో మొదటిసారిగా డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం 12 రోజులకు ఒకసారి భూమి ఉపరితలాన్ని మొత్తం స్కాన్ చేస్తుంది. అలాగే 5 నుంచి 10 మీటర్ల రిజల్యూషన్‌తో డేటాను అందిస్తుంది. ఇది భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు వంటి సహజ విపత్తులను పర్యవేక్షిస్తుంది. అలాగే, మంచు కరగడం, సముద్ర మట్టం పెరుగుదల, గ్రౌండ్‌వాటర్ వైవిధ్యం, అడవుల బయోమాస్, నేల తేమ వంటి అంశాలను కూడా గమనిస్తుంది. ఎల్-బ్యాండ్ వల్ల దట్టమైన అడవులు, మంచు ఉన్నా వాటి కింద ఉండే డేటాను ఇవ్వగలదు. ఎస్-బ్యాండ్ ఉపరితల వివరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఈ డేటా వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో సహాయపడుతుంది.

ఇస్రోకు-నాసా సహకారం ఎందుకు?
నిసార్ మిషన్ ఇస్రో , నాసా మధ్య 2014లో ఒప్పందంతో ప్రారంభమైంది. ఇది రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారంలో ఒక మైలురాయి. ఈ ఉపగ్రహంలో ఎల్-బ్యాండ్ రాడార్, 12 మీటర్ల విస్తరించే మెష్ యాంటెన్నా, హై-రేట్ టెలికమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్, జిపిఎస్ రిసీవర్లు, సాలిడ్-స్టేట్ రికార్డర్‌ను నాసా అందిస్తుండగా. ఎస్-బ్యాండ్ రాడార్, ఉపగ్రహ బస్ , జీఎస్‌ఎల్‌వి రాకెట్, ప్రయోగ సేవలను ఇస్రో అందిస్తోంది. ఈ సహకారం రెండు సంస్థల సాంకేతిక నైపుణ్యాన్ని సమన్వయం చేస్తుంది. ఖర్చును తగ్గిస్తుంది . నిసార్ డేటా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు, విపత్తు నిర్వహణ సంస్థలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది, ఇది భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపును, సాంకేతిక పురోగతిని తెస్తుంది.

ఇతర ఉపగ్రహాలతో నిసార్‌కు తేడా ఏమిటి?
సాధారణ ఉపగ్రహాల్లో ఆప్టికల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇవి మేఘాలున్నా, చీకటిగా ఉన్నా, దట్టమైన అడవుల వల్ల ఫోటోలు సరిగ్గా తీయలేవు, డేటాను కూడా సంక్రమంగా పంపలేవు. కానీ నిసార్ లో డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ ని ఉపయోగిస్తున్నారు. అంటే మేఘాలున్నా, చీకటిగా ఉన్నా దట్టమైన అడువులు ఉన్నా కూడా భూమి ఉపరితలాన్ని స్కాన్ చేయగలదు. ఎల్-బ్యాండ్ రాడార్ దట్టమైన అడవులు, మంచు లోపాల కూడా స్కాన్ చేయగలదు. ఎస్-బ్యాండ్ ఉపరితల వివరాలను స్పష్టంగా అందిస్తుంది. ఇది ఇతర ఉపగ్రహాలతో సాధ్యం కాదు.

నిసార్ తర్వాత మరికొన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. 2028లో చంద్రయాన్-4 మిషన్ ను ఇస్రో చేపట్టనుంది. చంద్రుని దక్షిణ ధ్రువం నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం. 2026లో గగన్‌యాన్ మిషన్ చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఇది భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర. ఇప్పటికే భారత్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి పంపడం ద్వారా.. కీలక విషయాలపై అతడికి అవగాహన వచ్చింది. శుభాంశు అనుభవం గగన్ యాన్ మిషన్ కు ఉపయోగపడనుంది.

Also Read: https://www.mega9tv.com/national/why-are-americans-and-australians-are-jealous-of-indians-what-made-them-for-a-racial-hatred/