మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన..!

Mumbai Konkan Ferry Services: భారత్‌లో రవాణా అంటే రైళ్లు, బస్సులు, ఫ్లైట్స్ అని అందరికీ తెలుసు.. కానీ ఫెర్రీ సేవలు ఇంకా అంతగా పాపులర్ కాలేదు. అయితే, మహారాష్ట్ర సర్కార్ ఈ సంప్రదాయాన్ని మార్చబోతోంది. ముంబై నుంచి కోంకణ్‌కు దక్షిణాసియాలోనే అత్యంత వేగవంతమైన ఫెర్రీ సేవ ప్రారంభించనుంది. రోడ్డు మార్గంలో 10 గంటలు పట్టే దూరానికి.. కేవలం 3 గంటల్లో ఈ ఫెర్రి చేరుకుంటుంది. అసలు ఈ ఫెర్రీ సేవల ప్రత్యేకత ఏంటి..? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ల నుంది..? దీనిలో టికెట్ ఎంత..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

భారత్‌లో రవాణా అంటే రైళ్లు, బస్సులు, ఫ్లైట్స్ పేర్లే వినిపిస్తాయి. ఫెర్రీ సేవలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో అవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు, ఆండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్‌లాక్ ఐలాండ్‌కు ఫెర్రీ, అస్సాంలో జోర్హాట్ నుంచి మజులీ రివర్ ఐలాండ్‌కు బ్రహ్మపుత్ర నదిపై ఫెర్రీ, గుజరాత్‌లో ఘోఘా-హజీరా ఫెర్రీ, కేరళలో ఎర్నాకులం-ఫోర్ట్ కొచ్చి ఫెర్రీలు చాలా పాపులర్. అయితే ఇప్పుడు మహారాష్ట్ర లో కూడా ఫ్రెర్రీ అందుబాటులోకి రానుంది. ముంబై-కోంకణ్ మార్గంలో రోడ్డు రవాణా అంటే గణేశోత్సవాల సమయంలో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్‌లు. రైలు మార్గంలో 5-6 గంటలు, కానీ డైరెక్ట్ కనెక్షన్ లేకపోవడం సమస్య. ఫ్లైట్స్ వేగంగా వెళ్లినా.. కానీ టికెట్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబై-కోంకణ్ ఫెర్రీ సేవ ఒక విప్లవాత్మక ఎంపిక!

M2M ఫ్రిన్సెస్ అనే ఫెర్రీ దక్షిణాసియాలోనే అత్యంత వేగవంతమైన ఫెర్రీగా రికార్డు సృష్టిస్తోంది. 25 నాట్స్ వేగంతో ప్రయాణించే ఈ ఫెర్రీ, ముంబై-అలీబాగ్ ఫెర్రీ కంటే రెండింతలు వేగవంతమైంది. ఈ ఫెర్రీలో 656 మంది ప్రయాణీకులకు సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. 552 ఎకానమీ, 44 ప్రీమియం ఎకానమీ, 48 బిజినెస్ క్లాస్, 12 ఫస్ట్ క్లాస్ సీట్లు ఉంటాయి. అంతేకాదు, 50 కార్లు, 30 టూ-వీలర్స్, మినీ బస్సులు, 45-సీటర్ బస్సులను కూడా రవాణా చేయగల సామర్థ్యం ఉంది.

టికెట్ ధరలు ఎలా ఉంటాయి..?
ఈ ఫెర్రీ సేవలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించారు. ఎకానమీ క్లాస్ టికెట్ రూ. 2,500 నుంచి, ఫ్లైట్ టికెట్ కంటే 7-8 రెట్లు చౌకగా ఉంటుంది. ప్రీమియం ఎకానమీ రూ. 4,000, బిజినెస్ క్లాస్ రూ. 7,500, ఫస్ట్ క్లాస్ రూ. 9,000. వాహన రవాణా ఛార్జీలు కారుకు రూ. 6 వేలు, టూ-వీలర్‌కు వెయ్యి, సైకిల్‌కు రూ. 600. బస్సులకు రూ. 13 వేల నుంచి రూ. 21 వేల వరకు ఉంది.

సమయం పరంగా ఫెర్రీ సేవలు ఎంతో మేలని అంటున్నారు. ముంబై నుంచి రత్నగిరి జైగడ్‌కు రోడ్డు మార్గంలో 10 నుంచి 12 గంటలు పడుతుంది. రైలు మార్గంలో 5 నుంచి 6 గంటల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్‌తో ఒక గంట ప్రయాణం అయినా, ఎయిర్‌పోర్ట్ ప్రొసీజర్స్‌తో 4 నుంచి 5 గంటలు అవుతుంది. కానీ ఈ ఫెర్రీతో ముంబై-జైగడ్ 3 గంటల్లో, ముంబై-విజయ్‌దుర్గ్ 5 గంటల్లో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా వెళ్లొచ్చు. గణేశోత్సవం వంటి రద్దీ సమయంలో ఈ జర్నీ ఎంతో ఉపయోగం.

భారత్‌లో ఫెర్రీ రవాణా పెద్దగా ఉపయోగించుకోరు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పాపులర్. గోవాలో మాండవీ నదిపై ఫెర్రీలు స్థానికులు, టూరిస్టులకు సుందరమైన ప్రయాణ అనుభవం అందిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో హుగ్లీ నదిపై హౌరా ఫెర్రీ, ఒడిశాలో చిలికా లేక్ ఫెర్రీలు పక్షి పరిశీలకులకు, టూరిస్టులకు ప్రసిద్ధి చెందారు. తమిళనాడులో నాగపట్టినం నుంచి శ్రీలంకకు HSC చెరియాపని ఫెర్రీ అంతర్జాతీయ రవాణాకు ఉపయోగపడుతోంది. ఈ ఫెర్రీలో కార్లు, బైక్లు తీసుకువెళ్లే సౌకర్యం ఉండటం అదనపు ప్రయోజనం. ఇప్పటికే ముంబై-అలీబాగ్ ఫెర్రీ విజయవంతంగా నడుస్తుంది, ఇది కోంకణ్ రూట్‌కు సక్సెస్ మోడల్ అంటున్నారు.

అయితే ఈ ఫెర్రీ సేవలు అన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. వాతావరణం, సముద్ర పరిస్థితులు, జెట్టీ మౌలిక సదుపాయాలు వంటిపై ఫెర్రీ సేవలకు అప్పుడప్పుడు ఆటంకం కలిగిస్తాయి. రైలు, బస్సు, ఫ్లైట్స్‌తో పోటీ పడాలంటే.. ప్రయాణికుల కాస్త అలవాటు పడాలి. సమయపాలన, భద్రతా ప్రమాణాలపై వీటి సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. Mumbai Konkan Ferry Services.

ముంబై-కోంకణ్ ఫెర్రీ సేవ భారత్‌లో ఫెర్రీ రవాణాకు ఒక కొత్త అధ్యాయం. సమయం ఆదా చేసే, సరసమైన, సౌకర్యవంతమైన ఈ సేవ సాంప్రదాయ రవాణా మార్గాలకు గట్టి పోటీ ఇస్తుంది. ఆండమాన్, అస్సాం, గుజరాత్, కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఫెర్రీలు విజయవంతంగా నడుస్తున్నాయి, ఇప్పుడు కోంకణ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ సేవ విజయవంతమైతే, భారత తీర రవాణా రంగం మొత్తం మారిపోవచ్చు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q