
MLA Gundappa Digital Arrest Scam: సైబర్ మోసాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఒకలా కేటుగాళ్లు జనాలను బురిడీ కొట్టించి భారీగా దోచుకుంటున్నారు. సామాన్యులతో పాటు వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు సైతం వీరి వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. తాజాగా, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇలాగే మోసపోయారు. ఇంతకు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..ఎలా మోసపోయారు. ఎంత సొమ్ము పోయింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
సాంకేతికత వినియోగం అధికమయ్యే కొద్దీ మోసాలు కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలతో బురిడీ కొట్టిస్తూ.. జనాలను లూటీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతులు, సమాజంలో ప్రముఖులు సైతం బాధితులవుతున్నారు. తాజాగా ఓ మాజీ ప్రజాప్రతినిధి కేటుగాళ్ల వలకు చిక్కి.. లక్షలు పోగొట్టుకున్నారు. ఈ అనుభవం కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఎదురయ్యింది. ఆయన్న డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్లు.. దాదాపు రూ.31 లక్షలు కాజేశారు.
అసలేమైందన్న విషయానికి వస్తే.. ఆగస్టు 12 సాయంత్రం ఒక నకిలీ సీబీఐ అధికారి గుండప్ప వకిల్‌కు ఫోన్ చేసి.. వ్యాపారవేత్త నరేష్ గోయల్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయన పేరు కూడా ఉందని చెప్పారు. సీబీఐ అధికారులు జప్తు చేసిన వాటిలో గుండప్ప పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు ఉన్నాయని, ఇవి నిధుల దుర్వినియోగానికి సంబంధించినవని ఆ మోసగాడు తెలిపాడు. ఆ తర్వాత, నకిలీ సీబీఐ అధికారి బాధితుడి వ్యక్తిగత వివరాలు, ఆస్తుల వివరాలు అడిగి తీసుకున్నాడు.
ఆ తర్వాత, ఆ కాల్‌ను నీరజ్ కుమార్ అనే వ్యక్తికి బదిలీ చేశారు. అతను తనను తాను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పరిచయం చేసుకుని, గుండప్ప వకిల్‌ను ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ కాల్ కట్ చేయకూడదని బాధితుడికి గట్టిగా సూచించాడు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో, మోసగాళ్లు బాధితుడిని వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ ‘న్యాయమూర్తి’ గుండప్పను ఆదేశించాడు. అంతేకాకుండా, RTGS ద్వారా రూ. 10.99 లక్షలను ఒక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు.
ఆ తర్వాత నీరజ్ కుమార్, మరో అధికారి సందీప్ కుమార్ అనే వ్యక్తులు ప్రతిరోజూ గుండప్ప వకిల్‌ను ఫోన్ చేస్తూ, దర్యాప్తు పేరుతో ఆయనను.. వారితోపాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను సేకరించారు. కొద్ది రోజుల తర్వాత, ఎమ్మెల్యేను మరోసారి వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. ఈసారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు కోసం రూ. 20 లక్షలు బదిలీ చేయాలని ఆదేశించారు. డబ్బు బదిలీ చేస్తే, విచారణ పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆ డబ్బును కూడా బదిలీ చేశాడు. MLA Gundappa Digital Arrest Scam.
చివరకు ఆ డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే… సైబర్ క్రైమ్ పోలీసులకు సెప్టెంబరు 6న ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q