క్లర్క్‌గా మాజీ ఎంపీ.!

Former MP Prajwal Revanna: నేరాలు చేసిన వారు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. నేరం చేసి తాత్కాలికంగా తప్పించుకుని తిరిగినా ఎల్లకాలం సాధ్యం కాదు. ఆయన ఒకప్పుడు ఎంపీ అంటే పార్లమెంట్ సభ్యుడు. దేశంలో చిన్న వయసులో ఎంపీ అయిన వాళ్లలో మూడోవాడు. ఆయనది దేశంలోని చాలా పాపులర్ పొలిటికల్ ఫ్యామిలీ. కుటుంబంలో దాదాపు అందరూ రాజకీయ నాయకులే. చట్టసభలకు వెళ్లినవారు. మంత్రులుగా పనిచేసినవారు. ఆయన తాత దేశానికి ప్రధానిగా పనిచేసిన నాయకుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైల్లో క్లర్క్ పని చేస్తున్నాడు ఇంతకు ఎవరు ఆ నేత ఎందుకు జైల్లో క్లర్క్ గా పనిచేయాల్సి వస్తుంది.. తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ

ఎంపీగా పనిచేసిన వ్యక్తి క్లర్క్‌గా పనిచేయడం ఏమిటి? ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందా? అనే సందేహాలు వస్తాయి కదా. కానీ ఆర్థికంగా ఏమీ చితికిపోలేదు. కోట్ల విలువైన సంపద ఉంది. జైల్లో ఆయన క్లర్క్‌గా పనిచేస్తున్నాడంటే అది ఉద్యోగం కాదు. ఆయన జీవిత ఖైదులో అదో భాగం. జీవిత ఖైదు అనుభవిస్తున్న నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నాడు.

ఇంట్లో సహాయకురాలిపై అత్యాచారం కేసులో దోషిగా నిర్దారణ అయిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ప్రజాప్రతినిధుల కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ప్రజ్వల్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, జైల్లో ఆయనకు లైబ్రరీ క్లర్క్‌ పనిని కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడ ఉండే ఖైదీలకు పుస్తకాలు జారీ చేసి వాటికి సంబంధించిన రికార్డులను నిర్వహించడం వంటి విధులను ప్రజ్వల్‌కు అప్పగించినట్టు తెలిపారు.

చిన్న వయసులోనే హసన్ నుంచి ఎంపీగా గెలిచాడు. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్.డి. రేవణ్ణ మంత్రిగా పనిచేశాడు. ఆయన సోదరుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రాజకీయంగా బలమైన కుటుంబానికి చెందిన ప్రజ్వల్ అత్యాచారం కేసులో ఇరుక్కొని, విదేశాలకు పారిపోయి చివరకు పోలీసులకు చిక్కి నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.

ఆయన ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరాడు, కానీ రాజకీయాలపై ఆసక్తితో దానిని మధ్యలోనే నిలిపివేశాడు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల వేళ హసన్ సెక్స్‌ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణపై పలు అత్యాచార, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసులో ఆయనను ప్రత్యేక కోర్టు ఈ ఏడాది మేలో దోషిగా ప్రకటించింది. 2024లో ఆయనపై వచ్చిన పలు వీడియోలు సంచలనం కావడంతో ‘సిట్’ దర్యాప్తు జరిపింది.

డిజిటల్, టెస్టిమోనియల్ సాక్ష్యాలను సేకరించింది. ప్రజ్వల్ అరెస్టు కావడానికి ముందు నెల రోజుల పాటు పరారీలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే. విచారణలో ప్రజ్వల్‌ దోషిగా తేలడంతో కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్నవారు నిబంధనల ప్రకారం వారికి చేతనైన పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు చేసినందుకు డబ్బు చెల్లిస్తారు. ప్రస్తుతం ఆయనకు ఈ జైలులో లైబ్రరీ క్లర్క్ విధులను కేటాయించారు. Former MP Prajwal Revanna.

తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటికి సంబంధించిన వివరాల రికార్డులను నిర్వహించడం వంటి బాధ్యతలు అప్పగించారు. ఈ పని చేస్తున్నందుకు రోజుకు రూ. 522 జీతంగా ప్రజ్వల్‌కు చెల్లిస్తారు. ప్రజ్వల్‌ ఆఫీస్ వర్క్‌ను ఎంచుకున్నాడుగానీ అధికారులు లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించామని అన్నారు. జైల్లో ఖైదీలు సాధారణంగా నెలకు కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు తప్పకుండా పని చేయాలనే నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కోర్టు విచారణలకు హాజరు కావడం, న్యాయవాదులను కలిసేందుకు ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేటాయించిన లైబ్రరీ క్లర్క్‌ పని షెడ్యూల్ పరిమితంగా ఉన్నదని వెల్లడించారు. రాజకీయాల్లో ఉజ్వలంగా వెలగాల్సిన ప్రజ్వల్ చేయరాని నేరం చేసి ఆరిపోయాడు.