ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్ట్.! ఒకరి అరెస్ట్..!

Unexpected twist Dharmasthala case: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక మృతదేహాలు ఖననం కేసు కీలక మలుపు తిరిగింది. వందలాది మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేశానని ఫిర్యాదు చేసిన మాస్క్ మ్యాన్ భీమా అసలు రంగు బయటపడింది. పారిశుద్ధ్య కార్మికుడు ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలు బూటకమేనని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించిన మాస్క్ మ్యాన్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

ధర్మస్థల ఆలయ పరిసరాల్లో సుమారు 100కు పైగా మృతదేహాలను ఖననం చేశానంటూ భీమా 15 రోజులుగా ఆడుతున్న నాటకానికి సిట్ బృందం తెరదించింది. మాయమాటలతో వ్యవస్థను నమ్మించి విచారణలో పదే పదే తన వాదనలు మార్చిన భీమా చివరకి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడు. దీంతో ప్రణబ్‌ మహంతి నేతృత్వంలోని సిట్ బృందం పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అదుపులోకి తీసుకుంది. ఇంత డ్రామా ఆడటానికి కారణాలేంటని రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. విచారణ అనంతరం భీమాను కోర్టులో హాజరు పరచనున్నారు. Unexpected twist Dharmasthala case.

గత కొంతకాలంగా, తన ముఖం బయటపడకుండా ముసుగు ధరించి ఒక వ్యక్తి ధర్మస్థలలో ఘోరాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అతడిని విచారణకు పిలిచింది. గంటల తరబడి సాగిన విచారణలో అతడు చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పాటు, చెప్పినవన్నీ కట్టుకథలని విచారణలో తేలింది. దీంతో, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారన్న కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ అరెస్ట్‌తో ధర్మస్థల కేసు అనూహ్య మలుపు తీసుకుంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q