విమానం కూలడానికి నాలుగు కారణాలు….!!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇంతకీ, ఈ విమానం ఎందుకు కూలిపోయింది? సాంకేతిక లోపమా, పక్షి ఢీకొనడమా, పైలట్ తప్పిదమా లేక వాతావరణ సమస్యా? నిపుణులు చెబుతున్నా ఆ నాలుగు కారణాలు ఏంటి..? ఈ దుర్ఘటన వెనుక ఉన్న నిజం ఏమిటి? బోయింగ్ విమానాల భద్రతపై మళ్లీ అనుమానాలు ఎందుకు లేవనెత్తుతున్నాయి? ఈ విమానం కూలిపోవడానికి ముందు ఆ చివరి క్షణాల్లో ఏం జరిగి ఉంటుంది?

అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక సాంకేతిక లోపాలు ప్రధాన కారణంగా చెప్పబడుతున్నాయి. నిపుణులు, ముఖ్యంగా బోయింగ్ ఇంజనీర్లు, ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ వైఫల్యం లేదా FADEC అనేది విమాన ఇంజన్లకు ఇంధన సరఫరాను నియంత్రించే కీలక వ్యవస్థ. ఇంధన ఫిల్టర్ జామ్ కావడం వల్ల ఇంజన్లకు ఇంధనం అందక, విమానం శక్తిని కోల్పోయి ఉండొచ్చు. ఈ సమస్య టేకాఫ్ సమయంలో విమానం 625 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత, అకస్మాత్తుగా 475 అడుగులకు పడిపోవడానికి కారణమై ఉండొచ్చు. గతంలో బోయింగ్ 787 మోడల్‌లో హైడ్రాలిక్ సమస్యలు, ఇంజిన్ పనితీరు లోపాలు గుర్తించబడ్డాయని నివేదికలు ఉన్నాయి. అమెరికా నిపుణులు విమానం సరైన స్థితిలో లేకపోవడం, రెక్కల డిజైన్‌లో సమస్యలు ఉండొచ్చని సూచిస్తున్నారు. ఈ సాంకేతిక లోపాలు విమానం నియంత్రణ కోల్పోవడానికి దారితీసి, జనావాస ప్రాంతంలో కూలిపోవడానికి కారణమయ్యాయని ప్రాథమిక విశ్లేషణలు చెబుతున్నాయి. బ్లాక్‌బాక్స్ డేటా ఈ అనుమానాలను ధృవీకరిస్తుందా లేదా కొత్త కారణాలను వెలుగులోకి తెస్తుందా అనేది విచారణపై ఆధారపడి ఉంటుంది. ఈ సాంకేతిక సమస్యలు బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా మళ్గీ చర్చకు దారితీశాయి.

పక్షులు ఢీకొనడం ఈ ప్రమాదానికి మరో కారణంగా చెప్పబడుతోంది. టేకాఫ్ సమయంలో పక్షులు విమాన ఇంజన్‌లో పడటం వల్ల, రెండు ఇంజన్లు విఫలమవడానికి అవకాశం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్లు శక్తిని కోల్పోతే, విమానం అవసరమైన ఎత్తూ, వేగాన్ని అందుకోలేక కూలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో పక్షుల కదలికలు సాధారణమని, కానీ రెండు ఇంజన్లు ఒకేసారి విఫలమవడం అరుదైన ఘటన అని అంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇంజన్లలో బ్లేడ్‌లు దెబ్బతిని, విమానం నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ దుర్ఘటన తీవ్రత పక్షులు ఢీకొనడంతోనే జరిగిందా లేదా ఇతర కారణాలతో కలిసి జరిగిందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

పైలట్ నియంత్రణ సమస్యలు కూడా ఈ ప్రమాదానికి కారణంగా చర్చలో ఉన్నాయి. యార్క్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జాన్ మ్యాక్‌డెర్మిడ్, విమానం 650 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత, చివరి క్షణంలో పైలట్‌కు సరిచేయలేని సమస్య ఎదురైనట్లు అనుమానిస్తున్నారు. ఇది మానవ తపడమా, లేదా సాంకేతిక లోపంతో ముడిపడిన సమస్యనా అనేది స్పష్టం కావాల్సి ఉంది. పైలట్ ల్యాండింగ్ గేర్‌ను రిట్రాక్ట్ చేయకపోవడం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఇది సాంకేతిక లోపంతో సంబంధం కలిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. పైలట్ మే డే కాల్ జారీ చేసిన కొద్ది సెకన్లలోనే విమానం ఎరిట, టాఫిక్ కంటర్‌లతో సంబంబం కోల్పోయింది. ఇంత వేగంగా జరిగిన ఈ ఘటనలో, పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేసి, జనాసంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విఫలమై ఉండవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సంఘటన పైలట్ శిక్షణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని గుర్తుచేస్తోంది.

జనావాస ప్రాంతంలో ల్యాండింగ్ కష్టం. అందుకే ఈ ప్రమాదం తీవ్రతను మరింత పెంచింది. మేఘనీనగర్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విమానం కూలడం వల్ల, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం పడి, చాలా మంది మెడికోలు మరణించారు. పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేసినా, సురక్షితంగా ల్యాండ చేయడం సాధ్యపడలేదని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం అధికంగా ఉండడం వల్ల పేలుడ తీవ్రత పెరిగి, చుట్టుపక్కల భవనాలు, చెట్లు కాలిపోయాయి. విమానం కూలిని కొద్ది సెకన్లలోనే ఈ పేలుడు జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. అటు వాతావరణ పరిస్థితులు, పిడుగులు, తుఫానుల వంటివి కూడా ప్రమాదానికి కారణం కావొచ్చు. అయితే ఈ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ప్రమాదం విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై చర్చకు కారణమైంది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అధునాతన విమానం అయినప్పటికీ, గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు నివేదికలు ఉన్నాయి. ఈ విమానం ఢిల్లీ నుంచి లండన్‌కు ఎన్నో సార్లు విజయవంతంగా ఎగిరినప్పటికీ, చాలా సార్లు సాంకేతిక లోపాలు గుర్తించబడ్డాయి. ఈ ప్రమాదం సాంకేతిక లోపం, పక్షలు ఢీకొట్టడం, పైలట్ నియంత్రణ సమస్యలు, జనావాస ప్రాంతంలో ల్యాండింగ్ కష్టం వంటి అనేక కారణాలు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ విశ్లేషణ పూర్తయితే, 90% కారణాలు స్పష్టమవుతాయని నిపుణులు చెబుతన్నారు. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో,అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇంతకీ, ఈ విమానం ఎందుకు కూలిపోయింది? సాంకేతిక లోపమా, పక్షి ఢీకొనడమా, పైలట్ తప్పిదమా లేక వాతావరణ సమస్యా? నిపుణులు చెబుతున్నా ఆ నాలుగు కారణాలు ఏంటి..? ఈ దుర్ఘటన వెనుక ఉన్న నిజం ఏమిటి? బోయింగ్ విమానాల భద్రతపై మళ్లీ అనుమానాలు ఎందుకు లేవనెత్తుతున్నాయి? ఈ విమానం కూలిపోవడానికి ముందు ఆ చివరి క్షణాల్లో ఏం జరిగి ఉంటుంది?

అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక సాంకేతిక లోపాలు ప్రధాన కారణంగా చెప్పబడుతున్నాయి. నిపుణులు, ముఖ్యంగా బోయింగ్ ఇంజనీర్లు, ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ వైఫల్యం లేదా FADEC అనేది విమాన ఇంజన్లకు ఇంధన సరఫరాను నియంత్రించే కీలక వ్యవస్థ. ఇంధన ఫిల్టర్ జామ్ కావడం వల్ల ఇంజన్లకు ఇంధనం అందక, విమానం శక్తిని కోల్పోయి ఉండొచ్చు. ఈ సమస్య టేకాఫ్ సమయంలో విమానం 625 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత, అకస్మాత్తుగా 475 అడుగులకు పడిపోవడానికి కారణమై ఉండొచ్చు. గతంలో బోయింగ్ 787 మోడల్‌లో హైడ్రాలిక్ సమస్యలు, ఇంజిన్ పనితీరు లోపాలు గుర్తించబడ్డాయని నివేదికలు ఉన్నాయి. అమెరికా నిపుణులు విమానం సరైన స్థితిలో లేకపోవడం, రెక్కల డిజైన్‌లో సమస్యలు ఉండొచ్చని సూచిస్తున్నారు. ఈ సాంకేతిక లోపాలు విమానం నియంత్రణ కోల్పోవడానికి దారితీసి, జనావాస ప్రాంతంలో కూలిపోవడానికి కారణమయ్యాయని ప్రాథమిక విశ్లేషణలు చెబుతున్నాయి. బ్లాక్‌బాక్స్ డేటా ఈ అనుమానాలను ధృవీకరిస్తుందా లేదా కొత్త కారణాలను వెలుగులోకి తెస్తుందా అనేది విచారణపై ఆధారపడి ఉంటుంది. ఈ సాంకేతిక సమస్యలు బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా మళ్గీ చర్చకు దారితీశాయి.

పక్షులు ఢీకొనడం ఈ ప్రమాదానికి మరో కారణంగా చెప్పబడుతోంది. టేకాఫ్ సమయంలో పక్షులు విమాన ఇంజన్‌లో పడటం వల్ల, రెండు ఇంజన్లు విఫలమవడానికి అవకాశం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్లు శక్తిని కోల్పోతే, విమానం అవసరమైన ఎత్తూ, వేగాన్ని అందుకోలేక కూలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో పక్షుల కదలికలు సాధారణమని, కానీ రెండు ఇంజన్లు ఒకేసారి విఫలమవడం అరుదైన ఘటన అని అంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇంజన్లలో బ్లేడ్‌లు దెబ్బతిని, విమానం నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ దుర్ఘటన తీవ్రత పక్షులు ఢీకొనడంతోనే జరిగిందా లేదా ఇతర కారణాలతో కలిసి జరిగిందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

పైలట్ నియంత్రణ సమస్యలు కూడా ఈ ప్రమాదానికి కారణంగా చర్చలో ఉన్నాయి. యార్క్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జాన్ మ్యాక్‌డెర్మిడ్, విమానం 650 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత, చివరి క్షణంలో పైలట్‌కు సరిచేయలేని సమస్య ఎదురైనట్లు అనుమానిస్తున్నారు. ఇది మానవ తపడమా, లేదా సాంకేతిక లోపంతో ముడిపడిన సమస్యనా అనేది స్పష్టం కావాల్సి ఉంది. పైలట్ ల్యాండింగ్ గేర్‌ను రిట్రాక్ట్ చేయకపోవడం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఇది సాంకేతిక లోపంతో సంబంధం కలిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. పైలట్ మే డే కాల్ జారీ చేసిన కొద్ది సెకన్లలోనే విమానం ఎరిట, టాఫిక్ కంటర్‌లతో సంబంబం కోల్పోయింది. ఇంత వేగంగా జరిగిన ఈ ఘటనలో, పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేసి, జనాసంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విఫలమై ఉండవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సంఘటన పైలట్ శిక్షణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని గుర్తుచేస్తోంది.

జనావాస ప్రాంతంలో ల్యాండింగ్ కష్టం. అందుకే ఈ ప్రమాదం తీవ్రతను మరింత పెంచింది. మేఘనీనగర్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విమానం కూలడం వల్ల, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం పడి, చాలా మంది మెడికోలు మరణించారు. పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేసినా, సురక్షితంగా ల్యాండ చేయడం సాధ్యపడలేదని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం అధికంగా ఉండడం వల్ల పేలుడ తీవ్రత పెరిగి, చుట్టుపక్కల భవనాలు, చెట్లు కాలిపోయాయి. విమానం కూలిని కొద్ది సెకన్లలోనే ఈ పేలుడు జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. అటు వాతావరణ పరిస్థితులు, పిడుగులు, తుఫానుల వంటివి కూడా ప్రమాదానికి కారణం కావొచ్చు. అయితే ఈ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ప్రమాదం విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై చర్చకు కారణమైంది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అధునాతన విమానం అయినప్పటికీ, గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు నివేదికలు ఉన్నాయి. ఈ విమానం ఢిల్లీ నుంచి లండన్‌కు ఎన్నో సార్లు విజయవంతంగా ఎగిరినప్పటికీ, చాలా సార్లు సాంకేతిక లోపాలు గుర్తించబడ్డాయి. ఈ ప్రమాదం సాంకేతిక లోపం, పక్షలు ఢీకొట్టడం, పైలట్ నియంత్రణ సమస్యలు, జనావాస ప్రాంతంలో ల్యాండింగ్ కష్టం వంటి అనేక కారణాలు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ విశ్లేషణ పూర్తయితే, 90% కారణాలు స్పష్టమవుతాయని నిపుణులు చెబుతన్నారు. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, డీజీసీఏ విచారణ జరుపుతున్నాయి..