
Jaish-e-Mohammed terrorist organization: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ కోరలు తీసిన పాములా తయారైంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ క్రమక్రమంగా తిరిగి బలం పుంజుకొని బీభత్సాన్ని సృష్టించడానికి కొత్త ప్లానే వేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగ్రసంస్థ రహస్యంగా నిధుల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.. తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్డేట్ మీ కోసం.
పాకిస్థాన్ వ్యాప్తంగా 313 కొత్త ఉగ్ర సంస్థలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. అక్కడ కొత్తగా జైషే ఎ మహమ్మద్ సంస్థలో చేరే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు, సురక్షితమైన ఆశ్రయం కల్పించేందుకు ఈ స్థావరాలను వినియోగించనున్నారు. అలాగే ఈ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్, అతడి కుటుంబానికి కూడా ఈ స్థావరాలు సురక్షిత ప్రాంతాలుగా ఉంటాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ ఉగ్ర సంస్థ 3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయాలను సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నిధులు సేకరించేందుకు మసూద్ అజర్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆన్లైన్లో నిధులు సేకరించేందుకు ఈజీ పైసా, సదాపే వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగించాలని ఆ సంస్థ ప్లాన్ వేసింది. జైషే కమాండర్లు శుక్రవారం మసీదులలో ప్రార్థనల సమయంలో విరాళాలు సేకరిస్తున్నారు. గాజాలో మానవతా సాయం పేరుతో ఈ విరాళాలు సేకరిస్తున్నారు. కానీ వాటిని ఉగ్ర కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. ఈ విరాళాలను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పరిశీలన నుంచి తప్పించడానికి ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్లను ఉపయోగించారు. ఈ డిజిటల్ వాలెట్లు మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొబైల్ నంబర్లతో రిజిస్టర్ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఈ నెంబర్లలో అతని సోదరుడు తల్జా అల్ సైఫ్, కుమారుడు అబ్దుల్లా అజార్ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
జైష్ ఎ మహమ్మద్‌తో లింక్ అయిన విరాళాల రసీదు కాపీ కూడా కనుగొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 3.94 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు పాక్ డిజిటల్ వాలెట్లను వెళ్తున్నట్లు దర్యాప్తులో ఆధారాలు కూడా దొరికాయి. సదాపే అకౌంట్ మసూద్ అజార్ సోదరుడు తల్హా అల్ సైఫ్ (పేరు మీద ఉంది. ఇది పాక్ మెబైల్ నెంబర్ కు లింక్ చేయబడింది. అయితే ఈ నెంబర్ జైష్ ఎ మహమ్మద్ హరిపూర్ జిల్లా కమాండర్ అఫ్తాబ్ అహ్మద్ పేరు మీద రిజిస్టర్ అయ్యంది.
పలు నివేదికల ప్రకారం.. ఈ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని తెలుస్తుంది. ఉగ్రసంస్థకు పాకిస్థాన్, విదేశాల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు స్పష్టం అవుతుంది. జైషే ఉగ్రసంస్థ ఈ నిధులతో మెషిన్ గన్స్, రాకెట్ లాంచర్లు, మోర్టార్ల వంటి ఆధునిక ఆయుధాలను కొనుగోలను చేసిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కొత్త ఆయుధాలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో జైష్-ఎ-మొహమ్మద్ ప్రపంచంపై కొత్త భీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉందని నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అధునాతన రహస్య కమ్యూనికేషన్ సాయంతో ఉగ్రవాద సంస్థ నాయకులు వారిని గుర్తించబడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ నిఘా నీడకు దొరకడం లేదు. Jaish-e-Mohammed terrorist organization.
మొత్తానికి ఆ ఉగ్రసంస్థకు భారీగా నిధులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జైష్ ఎ మహమ్మద్ కార్యకలాపాలు భారత్‌కు మరో కొత్త సవాలుగా మారనుంది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q