అమెరికా, ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు..!

Americans and Australians are jealous of Indians: ఆస్ట్రేలియాలో భారతీయులపై జాతి పేరుతో దాడులు చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు ఘటనలు విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, అక్కడ స్థిరపడిన భారతీయు కుటుంబాల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ దాడుల వెనుక కారణాలు ఏమిటి? ఎందుకు భారతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు..? భారతీయులంటే ఎందుకు అంత అసూయ? ఆస్ట్రేలియాతో పాటు అమెరికా వంటి దేశాల్లో కూడా ఇలాంటి జాతి విద్వేష దాడులు ఎందుకు పెరిగాయి? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి? భారతీయ విద్యార్థులు ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భారతీయులు ఏ దేశంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత ఒత్తిడిలోనైనా పనిచేయగలరు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలు భారతీయులనే ఎక్కువగా ఉద్యోగాల్లో పెట్టుకుంటాయి. దీంతో ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో భారతీయులు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. అయితే ఇది స్థానికంగా ఉండే అస్ట్రేలియన్, అమెరికన్లకు నచ్చడం లేదు.. ఎక్కడి నుంచో వచ్చి .. తమ ఉద్యోగాలను వీరు కొట్టేస్తున్నారనే అసూయ పెరిగిపోతోంది. దీనికి ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక ఉదాహరణ. భారతీయులకు అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ బహిరంగంగా చెప్పారు. దీని వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారనే లోకల్ ఫీలింగ్ కలిగింది. దీని వెనుక జాతి విద్వేషం కూడా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి టైమ్ లోని ఇటు ఆస్ట్రేలియాలో కూడా భారతీయులపై అసూయా ధ్వేషాలు పెరుగుతున్నాయి. అక్కడ కూడా భారతీయుల ప్రభావం పెరగడంతో స్థానికులు మన వారిపై దాడులు చేస్తున్నారు. Americans and Australians are jealous of Indians.

ఆస్ట్రేలియాలో భారత సంతతి పౌరులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ భారత విద్యార్థిపై దుండగులు తీవ్రంగా దాడి చేసిన ఘటన మరవకముందే మరో భారత విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మెల్‌బోర్న్‌లో ఉంటున్న సౌరభ్ ఆనంద్ అనే భారత విద్యార్థిపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో అతడి మెడ, తలకు తీవ్ర గాయాలు కాగా.. చేయి తెగిపోయింది. సౌరభ్ ఆనంద్ ఆల్టోనా మెడోస్‌లోని ఓ ఫార్మసీ నుంచి మందులు తీసుకొని ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో కొందరు అతడిపై కత్తితో దాడి చేశారు. ఇదే విధంగా భారతీయ విద్యార్థి చరణ్‌ప్రీత్‌ సింగ్‌పై కూడా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. జాత్యహంకారం కారణంగానే ఈ దాడులు జరిగాయని బాధితులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలో భారతీయులపై జాతి విద్వేషం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు విద్యార్థులు, ఉద్యోగుల రాక పెరిగింది. ఈ వలసల వల్ల స్థానిక ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. భారతీయ విద్యార్థులు, కొత్తగా వచ్చిన ఉద్యోగులు నగరాల్లోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొంతమంది స్థానిక యువత, గ్యాంగ్‌లు వలసదారులను అన్యాయంగా తమ ఉద్యోగాలు, వనరులు భారతీయులు దోచుకుంటున్నారనే భావనతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాక, సోషల్ మీడియా ద్వారా జాతి ద్వేషాన్ని ప్రేరేపించే దుష్ప్రచారం, రేసిస్ట్ వ్యాఖ్యలు కూడా ఇలాంటి దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ నివేదికల ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో జాతి విద్వేష దాడులు 40 శాతం పెరిగాయి.

ఆస్ట్రేలియాలో జాతి విద్వేష దాడులు కొత్తేమి కాదు. గతంలో చైనా, నేపాల్, పాకిస్తాన్, ఇతర దేశాల నుండి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులపై కూడా ఆస్ట్రేలియాలో దాడలు జరిగాయి. ఇటీవల భారతీయులపై దాడులు పెరగడం ఆందోళన చెందాల్సిన విషయం. కొన్ని సందర్భాల్లో ఈ దాడులు దోపిడీల రూపంలో జరిగినప్పటికీ, చాలా సందర్భాల్లో జాతి ఆధారిత ద్వేషం స్పష్టంగా కనిపిస్తోంది. అటు అమెరికాలో కూడా భారతీయులుపై జాతి విద్వేష దాడులు గత కొన్ని సంవత్సరాలుగా పెరిగాయి. 2024లో FBI నివేదిక ప్రకారం, అమెరికాలో 8,200కి పైగా హేట్ క్రైమ్‌లు నమోదయ్యాయి. ముఖ్యంగా టెక్ రంగంలో భారతీయుల ఆధిత్యం స్థానికులలో కొందరిలో అసంతృప్తిని కలిగిస్తోంది. దీనికి తోడు ట్రంప్ వంటి కొందరు కొందరు రాజకీయ నాయకులు వలసదారులను స్థానికుల ఉద్యోగాలు లాక్కుంటున్నారు అని చిత్రీకరించడం ద్వేష భావనలను రేకెత్తిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా విజాతి ద్వేష దాడులు ఎక్కడ ఎక్కువ?
ప్రపంచవ్యాప్తంగా జాతి ఆధారిత దాడులు ఎక్కువగా నమోదయ్యే దేశాల అమెరికా మొదటి వరుసలో ఉంది. FBI గణాంకాల ప్రకారం, 2024లో 8,200కి పైగా జాతి ఆధారిత హేట్ క్రైమ్‌లు నమోదయ్యాయి, ఇవి ప్రధానంగా ఆసియన్లు, ఆఫ్రికన్-అమెరికన్లు పై జరిగాయి. అమెరికా తర్వాత యూకేలో ఎక్కువ జాతి విద్వేషదాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆసియా ప్రాంతం నుంచి వెళ్లినవారు, ముస్లింలపై ఎక్కువగా యూకేలో దాడులు జరుగుతున్నాయి. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఇక్కడ గత మూడు సంవత్సరాల్లో భారత్, చైనా, నేపాల్ నుంచి వచ్చిన వలసదారులపై దాడులు మూడింతలు పెరిగాయి. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో సిరియన్, ఆఫ్రికన్ వలసదారులపై జాతి ద్వేష దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.

భారతీయ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?
ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు ఇలాంటి దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా, స్నేహితులు లేదా స్థానిక భారతీయ సమాజంతో కలిసి ఉండాలి. భారత కాన్సులేట్, హై కమిషన్ జారీ చేసే భద్రతా సూచనలను పాటించాలి. ఎమర్జెన్సీ నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. విద్యా సంస్థల్లోని భద్రతా బృందాలతో సంప్రదింపులు జరపాలి, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, జాతి ద్వేష వ్యాఖ్యల నుంచి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులతో వారానికి కనీసం రెండు సార్లు మాట్లాడాలి, లొకేషన్ షేరింగ్ ఆన్ చేయాలి. అలాగే స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోవడం, సమన్వయంగా ఉండటం మంచింది.

Also Read: https://www.mega9tv.com/national/indias-victory-over-pakistan-in-1999-kargil-vijay-diwas-checkout-the-full-information-over-pakistani-terrorists/