
CP Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్… పూర్తిపేరు చంద్రపురం పొన్నసామి రాధాకృష్ణన్. సంఘ్ పరివార్ నుంచి బీజేపీలోకి వచ్చిన వ్యక్తి. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్, కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అలాగే జార్ఘండ్ గవర్నర్ బాధ్యతలు నిర్వహించారు. అలాగే తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరిలెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయన పనిచేశారు. అంతేకాదు, ఆయన గురించి కొన్ని కీలక విషయాలు కూడా తెల్సుకుందాం.
1957లో తమిళనాడులోని తిర్పూర్లో జన్మించిన రాధాకృష్ణన్, కోయంబత్తూరు కాలేజీలో బీబీఏ పూర్తి చేశారు. క్రికెట్, వాలీబాల్ అంటే ఆయనకు చాలా ఇష్టమైన ఆటలు. 1974 దశకంలో భారతీయ జనసంఘ్ రాష్ట్ర నేతగా పనిచేసిన ఆయన, 2004 నుంచి 2007 నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే అద్వానీ పాదయాత్ర సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిర రాధాకృష్ణన్, 93 రోజుల పాటు 19 వేల కిలోమీటర్ల యాత్రలో పాల్గొన్నారు. ఇంత వరకూ ఓకే, ఇప్పుడు బీజేపీ ఆయన్నే ఎందుకు ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేసింది. ఇదే వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. అది కూడా తెల్సుకుందాం.
ముందుగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎంపిక ఎందుకు జరిగింతో తెల్సుకుందాం. ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఢిల్లీలో జాట్ ఆందళోన భారీగా జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేరణతో జాట్లు రైతు ఉద్యమం వెనుక బలంగా నిలబడ్డారు. దీంతో వారిని కన్విన్స్ చేసేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన జగదీప్ ధన్కర్ పేరు తెరమీదకు తెచ్చింది బీజేపీ అధిష్టానం. అందుకు సంఘ్ మూలాలు లేకపోయినా ధన్కర్ ను ఉపరాష్ట్రపతి సీటులో కూర్చోబెట్టింది. ఇక ఇప్పుడు రాధాకృష్ణన్ ఎంపిక వెనుక కూడా బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆర్ఎస్ఎస్ బ్యాడ్రాప్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవ్వడం. రెండో పాయింట్, జనసంఘ్ నుంచి బీజేపీ వరకూ జాతీయ స్థాయిలో కీలక పదవులు నిర్వహించిన అనుభవంతో పాటు, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేయడం. అంటే ఈ రెండు కారణాలతో ఆయనకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లోని నేతలతో మంచి సంబంధాలు ఏర్పడేలా చేసింది.
అంతేకాదు, స్వతహాగా వివాద రహితుడైన రాధాకృష్ణన్ మీద విపక్ష పార్టీలకు మంచి అభిప్రాయమే ఉంది. అంతందెకు, తమిళనాడులో ఆయన్ని కోయంబత్తూరు వాజ్ పేయ్ అంటూ పిలుస్తారు. ఇవన్నీ ఒకటైతే, అసలు రీజన్ మరొకటి ఉంది. తమిళనాడులో వెళ్లార్ కులస్తుల ఓటింగ్ చాలా కీలకం. స్వతహాగా కొంగు వెళ్లార్ కులస్తుడైన రాధాకృష్ణన్ కు ఆ సామాజికవర్గంలో మంచి పట్టుంది. ఇక ఎటూ వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. దీంతో తమిళనాడు నుంచి ఆయన్ని ఎంపిక చేయడం అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లే. అలాగే కొంగు వెళ్లార్ కులస్తులతో పాటు తమిళనాడులో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న ఓబీసీలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా అర్థం అవుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి విడిపోయిన అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసింది. ఇది డీఎంకే పార్టీకి బాగా కల్సొచ్చింది. CP Radhakrishnan.
ఆ దెబ్బతో కంగుతిన్న అన్నా డీఎంకే రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసే ముందుకు వెళ్తామని డిక్లేర్ చేసింది. అంటే బీజేపీతో సీట్ల షేరింగ్ కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే సనాతన ధర్మం మీద బీజేపీ, డీఎంకే మధ్య తమిళనాడులో వార్ నడుస్తోంది. ఇక పార్టీ ఓట్ బ్యాంక్ పెరగడంలో తన వంతు ప్రయత్నం చేశారు అన్నామలై. ఈ మొత్తం వ్యవహారంతో తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ కొంచెం పెరిగినట్లు అయింది. అందుకే, రాబోయే తమిళనాడు ఎన్నికలను టార్గెట్ చేసిన బీజేపీ అటు అన్నాడీఎంకేతో పొత్తు ధర్మం పాటిస్తూనే, సొంతంగా బలం పెంచుకునే పనిలో పడిందట. దానికి తొలి అడుగే ఉపరాష్ట్రపతి పీ.సీ.రాధాకృష్ణన్ ఎంపికగా అర్థం అవుతోంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q