
Gold Price in 5years: బంగారం ధరలు మరో ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయా..? అంటే ఇప్పుడు 10 గ్రాముల మేలిమి బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. 2030 నాటికి ఇది 2 లక్షల రూపాయలు దాటుతుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఇదేదో కాకి లెక్క కాదు. అలాగని ఎలాగూ బంగారం పెరగడం ఖాయమని ఊహించి చెప్పే మాట కూడా కాదు. బంగారం ధర ఎలా రెట్టింపు అవుతుందా… పక్కా లెక్కతో చెప్పే వివరణ. అసలు బంగారం ధర 2030 నాటికి ఎలా రెట్టింపు అవుతోంది..? దీనికి కారణం ఏంటి..? బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇప్పుడు ఏం చేయాలి…? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చివరి వరకు చూడండి.. లేకపోతే గోల్డెన్ చాన్స్ మిస్ కాకతప్పదు.
ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి కారణం తెలుసా..? అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీన పడటం. డాలర్ విలువ ఎందుకు తగ్గిందో పక్కన పెట్టండి. అసలు బంగారానికి, డాలర్ కు లింకు ఏంటో ముందు తెలుసుకుందా. డాలర్ విలువకు బంగారం ధరలకు బలమైన వ్యతిరేక సంబంధం ఉంది. అంటే డాలర్ విలువ తగ్గితే, బంగారం ధరలు పెరుగుతాయి, ఎందుకంటే బంగారం ధర అంతర్జాతీయంగా డాలర్‌లోనే కొలుస్తారు. డాలర్ వీక్ అయితే, బంగారం కొనడానికి ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది, దీనివల్ల ధరలు పెరుగుతాయి. ఈ ఏడాదిలో ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో డాలర్ 10% వరకు బలహీనపడింది, గత ఆరు నెలల్లో బంగారం ధర 20% పెరిగింది. అయితే డాలర్ ధర తగ్గితే కదా బంగారం ధర పెరిగిదే అనుకోవచ్చు. అయితే రావోయే రోజుల్లో అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గనుంది. కాదు ట్రంపే స్వయంగా తగ్గేలా చేయనున్నారు.
అమెరికా త్వరలో తన ఆర్థిక విధానంలో పెద్ద మార్పు తీసుకురాబోతోంది. దీని వల్ల బంగారం ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఎలాగంటే.. ట్రంప్ నిర్ణయాలు అందరికీ తిక్కలా అనిపిస్తాయి. కాని ట్రంప్ పెద్ద బిజినెస్ మెన్. ప్రపంచ అధ్యక్షుల్లో వ్యాపారం గురించి ట్రంప్ కు తెలిసినంత ఎవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్ లు, అమెరికా ఫస్ట్ విధానాల పేర్లను పదే పదే వినిపిస్తున్నారు. ఇవి మిగిలిన దేశాలకు తలనొప్పిగా మారినా అమెరికాకు మాత్రం పెద్ద మేలే చేస్తాయి. ఎందుకంటే అమెరికా ఇప్పటివరకు ప్రపంచ వినియోగదారుగా ఉండగా, ఇప్పుడు నెట్ ప్రొడ్యూసర్గా మారాలని చూస్తోంది. అంటే ఇప్పటి వరకు ఇతర దేశాల్లో తయారైన వస్తువులను దిగుమతి చేసుకుని అమెరికా వాడుకునేది.. కాని ఇప్పుడు తాము తయారు చేసిన వస్తువులనే ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చూస్తోంది. దీని కోసం ట్రంప్ అనేక కంపెనీలను తమ ఉత్పత్తి ప్లాంట్లను అమెరికాలోని ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ అంటున్నారు. ఇలా చేయడం వల్ల అమెరికానే అన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం అమెరికా ఎగుమతులు, దిగుమతుల్లో చాలా తేడా ఉంది. అంటే 10 రూపాయల సరుకులు దిగుమతి చేసుకుంటే.. 2 రూపాయల సరుకులు ఎగుమతి చేస్తోంది. దీనిని మార్చాలని ట్రంప్ చూస్తున్నారు. అంటే అన్ని దేశాల వారు అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అయితే ఓ పక్క డాలర్ విలువ ఆకాశాన్ని తాకుతోంది. ఇలాంటి సమయంలో అంతంత డాలర్లు పెట్టి అమెరికా ఉత్పత్తులు ఎవరు కొంటారు. అందుకే ట్రంప్ కొత్త ప్లాన్ వేశారు. డాలర్ విలువ తగ్గేలా చేస్తే.. అందరూ తమ ఉత్పత్తులే కొంటారుగా అంటున్నారు ట్రంప్.
డాలర్ విలువ తగ్గించడానికి ట్రంప్ ప్లాన్ ఏంటి.?
ఇటీవల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ డాలర్ విలువ తక్కువగా ఉంటే ఎక్స్‌పోర్ట్స్ ద్వారా ఎక్కువ లాభం వస్తుందని అన్నారు. డాలర్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల ఏమీ అమ్మలేమని.. అది కేవలం ఇన్‌ఫ్లేషన్‌ను పెంచుతుందని చెప్పుకొచ్చారు. డాలర్ విలువ పెరుగుదల మానసిక సంతృప్తి మాత్రమే ఇస్తుంది తప్ప అమెరికాకు లాభం ఉండదని ట్రంప్ అన్నారు. ట్రంప్ మాటలు చూస్తే అమెరికా ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్స్‌ను పెంచడానికి, ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించడానికి డాలర్ విలువను తగ్గించే ఆలోచనలో ఉందని అర్థమవుతోంది. ఈ పాలసీలు అమలైతే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్‌లు, ట్రేడ్ కంట్రోల్స్ వంటి చర్యలు బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా పాలసీలు అమలైతే, బంగారం ధరలు దీర్ఘకాలంలో భారీగా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే బంగారం అనేది డాలర్ బలహీనతకు వ్యతిరేకంగా స్టెబుల్ అసెట్‌గా పనిచేస్తుంది. ఈ లెక్కన 2030 నాటికి బంగారం ధర 7 వేల డాలర్లకు చేరే అంచనాలు ఉన్నాయి. అంటే వచ్చే ఐదేళ్లలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2 లక్షల రూపాయలు దాటేస్తుంది అన్నమాట.
అమెరికా తన డాలర్‌ను ఉద్దేశపూర్వకంగా డీవాల్యూ చేయకపోయినా, టారిఫ్‌లు, ట్రేడ్ కంట్రోల్స్ వల్ల డాలర్ విలువ సహజంగానే తగ్గుతుంది. ఇది బంగారం ధరలను ఆటోమేటిక్ గా పెంచుతుంది. బంగారం ఎప్పుడూ కూడా ఇన్‌ఫ్లేషన్‌కు వ్యతిరేకంగా, బలమైన అసెట్‌గా మళ్లీ డిమాండ్‌లోకి వస్తుంది. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 3,800 డాలర్ల నుంచి 3,850 డాలర్లకు చేరొచ్చు. రెండేళ్లలో 4,000 డాలర్లు దాటడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. అంటే బంగారం రెండేళ్లలో లక్షన్నర దాటేస్తుంది అన్నమాట. జూలై నెలలో డాలర్ కాస్త బలపడినప్పుడు బంగారం ధర స్వల్పంగా తగ్గినా, ఆ సమయంలో బంగారం కొంటే మేలు అని అందరూ కొనడంతో డిమాండ్ పెరిగి మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ట్రేడ్ పాలసీలు, రాజకీయ అనిశ్చితి బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఇక బంగారం ధరలు రాకెట్ లా దూసుకుపోవడం ఖాయమే అంటున్నారు. Gold Price in 5years.
బంగారంలో పెట్టుబడి మంచిదేనా?
బంగారం ఎప్పుడూ సేఫ్ హెవెన్ అసెట్‌గా పరిగణించబడుతుంది, ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి, ఇన్‌ఫ్లేషన్ సమయాల్లో బంగారం ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. అందుకే పలు దేశాలు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల ఆర్బీఐ కూడా బంగారు కొనుగోలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక మాంద్యం, డాలర్ బలహీనత, ట్రంప్ టారిఫ్‌లు వంటి అంశాలు బంగారం డిమాండ్‌ను పెంచుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో బంగారం విలువు పెరగడం తప్ప.. తగ్గడం ఉండదు. భవిష్యత్తులో డబ్బులుంటే బంగారం కొనాలనుకునే వారు.. పిల్లల పెళ్లిళ్లకు కాసు బంగారం కూడా బెట్టాలని అనుకునే వారి ఇప్పుడే కొన్కుకోవడం బెటర్ లేకపోతే తర్వాత ఫీల్ కాకతప్పదు. మరి ఇంకెందుకు ఆలస్యం అప్పు చేసైనా బంగారం కొనేయండి.