
106 Years Old Pataiya Baba: ప్రస్తుత రోజుల్లో 50 ఏళ్లు బతకడమే కష్టంగా మారిపోయింది. 40 ఏళ్లు దాటడమే ఆలస్యం… చాలామంది అనేక రోగాల బారీన పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అయితే ఓ బాబా మాత్రం 106 ఏళ్ల వయసులోనూ కర్ర సాయం లేకుండానే నడుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు పరిగెడుతూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.. ఇది ఏదో కథలో విన్న కల్పిత గాథ కాదు. నిజమైన ఓ వ్యక్తికి సంబంధించింది. ఇంతకు ఎవరు ఆయన..? ఎక్కడ ఉంటారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ
బిహార్‌లోని ఛప్రాలో పతైయా బాబా అనే వ్యక్తి ఉంటున్నారు. ఈయన వయసు 106 ఏళ్లు. శరీరానికి శక్తినిచ్చే ఆహారం లేకుండా కేవలం వేప ఆకులు తిని 32 ఏళ్ల పాటు తపస్సు చేశాడంటే నమ్మగలరా? 106 ఏళ్ల వయసులో కర్ర సాయం లేకుండా 3-4 కిలోమీటర్లు నడవడమే కాకుండా, అప్పుడప్పుడు పరుగెత్తే దృశ్యాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన ముఖంలో నిత్యం మెరుపు, శరీరం ఆరోగ్యంగా ఉండటం చూసి చాలామంది ఆయనను అద్భుతంగా భావిస్తారు.
పతైయా బాబా తన జీవితం గురించి వివరిస్తూ, తాను ఒకప్పుడు చిత్రకూట్‌లోని 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవిలో 32 సంవత్సరాలు కఠోర తపస్సు చేశానని చెప్పారు. ఆ కాలంలో భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంది. తన తపస్సు సమయంలో, ఆయన కేవలం వేప ఆకులు, గడ్డి మాత్రమే తిని జీవించారు. ఆ సమయంలో ఆయనతో పాటు దేవరహవా బాబా, త్రిదండి స్వామి, ఖపడియా బాబా, ముఖ్రామ్ బాబా, అనేకమంది సాధువులు తపస్సు చేశారని ఆయన తెలిపారు. “ఆ రోజుల్లో కఠోర తపస్సు ద్వారా మాత్రమే ఆత్మశక్తి, దైవ దర్శనం లభించేవి,” అని బాబా అన్నారు.
పతైయా బాబా చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఆయన వెయ్యికి పైగా యజ్ఞాలు చేశారు. భారత్‌లోని అనేక ప్రాంతాల్లో గడిపారు. చాలావరకు దేవాలయాల నిర్మాణానికి సహకారం అందించారు. భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందు పాకిస్థాన్‌లోని కరాచీ, ఇతర నగరాల్లోని దేవాలయాల్లో సేవలందిచారు. భారత్‌లోనే కూడా విదేశాల్లో కూడా ఆయన కాలినడకతోనే నడిచేవారు. నడక, యోగా ఆయన దినచర్యలో భాగంగా ఉండేవి. ఈ పర్యటనలన్నీ ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచి, శారీరకంగా ధృడంగా ఉండటానికి దోహదపడ్డాయి.
106 ఏళ్ల వయసులోనూ ఆయన ఆరోగ్యంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతిరోజూ ఆయన ఉదయం దేవుడిని పూజిస్తారు. అనంతరం యోగా చేసి, నడుస్తారు. పండ్లు, తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇవి పాటించడం వల్లే తాను ఎక్కువకాలం బతికి ఉన్నట్లు బాబా చెబుతున్నారు. ఎక్కువగా ఆహారం తీసుకోవడం మానుకోవాలని ప్రతిరోజూ యోగా తేలికపాటి వ్యాయామాలు చేస్తేనే శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని బాబా ప్రజలకు సలహా ఇస్తున్నారు. 106 Years Old Pataiya Baba.
పతైయా బాబా జీవితం నేటి యువతకు, వృద్ధులకు ఒక గొప్ప స్ఫూర్తి. నేటి సమాజంలో చిన్నపాటి సమస్యలకే మానసికంగా కృంగిపోతుంటారు. కానీ, బాబా తన జీవితాన్ని తపస్సు, సేవతో ఒక ఆదర్శంగా మార్చుకున్నారు. ఛప్రా నుండి దేశంలోని అనేక ప్రాంతాల వరకు పతైయా బాబా కథ అందరి మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆయన నిరాడంబరత నిత్య దినచర్య మనందరికీ సంయమనం, ఆధ్యాత్మిక జీవితం నిజమైన శక్తిని ఇస్తాయని తెలియజేస్తున్నాయి. చాలామంది ఆయన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అనేక విషయాలు అడిగితెలుసుకుంటున్నారు .
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q