తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల జోష్.!!

Nizamabad district MLC Seat: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి ఉప ఎన్నిక జరగనుంది పార్టీ నుండి సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించింది దీంతో ఈ ఉప ఎన్నిక చర్చ తెరపైకి వచ్చింది ఎమ్మెల్సీ స్థానానికి 2020 లో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది

బి ఆర్ ఎస్ అంటే కవిత కవిత అంటే టిఆర్ఎస్ లాగా ఉన్న పార్టీలో ప్రస్తుతం ఆమె ఒంటరైన పరిస్థితి ఉంది పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా కవిత వైపు మాట్లాడలేదు మరోవైపు ఆమె సస్పెన్షన్ను సమర్థించారు బిఆర్ఎస్ కు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియా గా టిఆర్ఎస్ కు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు పోస్టులు చేయడం జిల్లాలో ఒంటరి అనే భావాలను కలిగించాయి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో జిల్లాలో ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకులు బహిరంగంగా మాట్లాడలేదు ఆమెకు మద్దతుగా నిలవలేదు

బి ఆర్ ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీసింది పార్టీ నుంచి వేటుపడిన వెంటనే ఆమె తన శాసనమండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది 2019లో ఎంపీగా ఓటమిపాలైన కవిత 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిపై అర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక రాగా కవిత బరిలో నిలిచి గెలిచారు ఆ సానం కాలపరిమితి ముగియడంతో 2022 జనవరిలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 2028 వరకు కాల పరిమితి ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో వీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక జరుగుతుంది

తెలంగాణ జాగృతి పేరుతో ఊరూరా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన కవితను విఆర్యస్ నుంచి సస్పెండ్ చేయటం తీవ్ర చర్చకు దారితీసింది కొత్త పార్టీ పెడతారా వేరే పార్టీలో చేరుతారా అనే విషయంపై ఇంకా తేలలేదు జిల్లాలో మాత్రం ఆమె ఒంటరైన పరిస్థితి ఉంది హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లాకు చెందిన బి.ఆర్.ఎస్ నేతలు ఎవరూ పాల్గొనలేదు కేవలం కొద్ది మంది జాగృతి కార్యకర్తలు తప్ప జిల్లా నుంచి పెద్దగా నాయకులెవరు ఆమె వెంట కనిపించలేదు ఒకప్పుడు టిఆర్ఎస్ జిల్లా పార్టీని తన కన్ను సన్నుల్లో నడిపిన కవిత నేడు ఒంటరి కావటం ఆమె స్వయంకృతాపరాధమే

జిల్లా కోడలిగా సుపరిచితురాలైన కవితను జిల్లా ప్రజలు ఆదరించారు 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు ఆ తర్వాత ఐదేళ్లపాటు కవిత జిల్లాలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు ఆమె జోక్యాన్ని నచ్చని అప్పటి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెకు సహకరించకపోవడంతో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత ఆమె 2020లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. 2022 తిరిగి ఎమ్మెల్సీగా గెలుపొందారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె జిల్లాకు అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు తెలంగాణ ఉద్యమంలో జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించిన కవిత 2010లో నిజామాబాద్ అర్బన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ జేఏసీ తరఫున పోటీ చేసిన ఎండల లక్ష్మీనారాయణ గెలుపులో కవిత కీలక పాత్ర పోషించారు తెలంగాణ జాగృతి పేరుతో జిల్లాలోని ప్రతి గ్రామంలో బతుకమ్మలు నిర్వహించిన ఘనత కవిత జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి టిఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో ఆమె కొత్త పార్టీ పెడుతుందా లేక ఇతర పార్టీలలో చేరుతుందా అనే విషయంపై ఆమె సన్నిహితులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా టిఆర్ఎస్ లో ఆమె ప్రస్థానం ముగిసింది

2018 లో పిసిసి మాజీ అధ్యక్షుడు రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ బి.ఆర్.ఎస్ నుండి సస్పెండ్ చేయాలని జిల్లా నాయకులందరి చేత రికమండేషన్ చేయించారు కవిత నేడు పార్టీ నుంచి తానే సస్పెండ్ అయ్యింది రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ కు ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి మధ్య తగాదా జరగా అప్పుడు భూపతిరెడ్డిని సైతం పార్టీ నుండి సస్పెండ్ చేయించి ఆ ఎమ్మెల్సీ పదవిని కవిత సొంతం చేసుకున్నారు 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు డి ఎస్ తనయుడు ప్రస్తుత ఎంపీ అరవింద్ బిజెపిలో చేరగా వీఆర్ఎస్ లో ఉన్న డిఎస్ ను సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత కేసిఆర్ కు కవిత జిల్లా నాయకులు అందరి చేత ఒత్తిడి తెచ్చి లెక్క రాయించారు అయితే చాలామంది డిఎస్పి సస్పెన్షన్ లేఖలను జీర్ణించుకోలేకపోయారు ఇప్పుడు తన తండ్రి స్థాపించిన పార్టీ నుండి కవితను సస్పెండ్ చేయటంతో గతంలో ఆమె జిల్లాలోని నాయకులను సస్పెండ్ చేయించిన సంఘటనను గుర్తుకు వస్తున్నాయి

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఆ పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్కు లేక పంపించడంతో ఆ స్థానానికి ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది ఇంకా మూడున్నర ఏళ్లపాటు ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది శాసనమండలి చైర్మన్ రాజీనామాను ఆమోదిస్తే ఈ స్థానానికి ఉపఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థలు లేకపోగా మున్సిపల్ కార్పొరేషన్లు పాలకవర్గాలు లేవు. ఈనెల చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలు లేవు. రాజీనామా ఆమోదం తర్వాత 6 నెలల లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో ఆలోపు ఎన్నికలు పూర్తయ్య అవకాశం ఉంది ఇటీవల జరిగిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఈ సీటుపై కన్నేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి. Nizamabad district MLC Seat.

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ పొందిన నాయకులందరూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుపోవడం ఆ పదవి కలిసి రాదు అనటానికి సంకేతంగా నిలుస్తోంది గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అరికల నరసారెడ్డి ఒక్క ఓటు తేడాతో వెంకటరామిరెడ్డి పై గెలుపొందగా ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు ఫలితం తేలేలోగా పదవీకాలం పూర్తయింది ఆ తర్వాత 2016లో ఎమ్మెల్సీగా ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గెలుపు పొందగా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన బిఆర్ఎస్ నుండి సస్పెండ్ కావటంతో ఎమ్మెల్సీ పదవి పోయింది ఆ తర్వాత 2020లో కవిత ఎమ్మెల్సీగా గెలిచారు తిరిగి 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత గెలుపొందారు ఇక ఆమె పదవి కాలం మూడున్నర ఏళ్లపాటు ఉండగా ఇప్పుడు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి ఆమె సస్పెండ్ అయ్యారు ఈ విధంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి పొందిన వారంతా వివాదాస్పదంగానే మారుతున్నారు.