కోమటిరెడ్డి బ్రదర్స్ “RRR” వార్..!

Komatireddy Brothers War: “సొంత పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా? ఆయన దూకుడు సహచార ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పడేస్తుందా? వేలాది మందితో ప్రభుత్వం మీదే దండెత్తే ప్లాన్లో ఆ ఎమ్మెల్యే ఉన్నారా?.. మంత్రి పదవి ఆ ఇద్దరు అన్నతమ్ముల్ల మధ్య చిచ్చు పెడుతుందా? అసలు ఆయన రాజకీయ వ్యూహం ఏంటి? ఎవరా నేత?

‘తెలంగాణ ప్రభుత్వం’,రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై కొంతకాలంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి..తనకు మంత్రి పదవి విషయంలో దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించడం లేదన్న అభిప్రాయంతో ఉన్నారట ఈ హస్తం సీనియర్ నేత..దాంతో రోజు రోజు కు స్వరం పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఆలస్యమైనా పర్వాలేదు మంత్రి పదవి వస్తుంది. వేచి చూసే ఓపిక నాకు ఉందని ఓవైపు అంటూనే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం వదలకుండా రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే తాజాగా ‘రీజనల్ రింగ్ రోడ్’ భూ బాదితులతో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశంలో చేసిన కామెంట్స్ దుమారం లేపాయి.తన ధిక్కారాన్ని మరో రూపంలోకి మార్చి పోరుబాటందుకోవడం చర్చనియంశంగా మారింది. అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం మీద పోరాటం కోసం రూటు మార్చి టాప్ గేరేశారా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖా మంత్రి గా త్రిబుల్ ఆర్ ను యుద్ధ ప్రత్తిపాధికన పూర్తి చేస్తామంటూ ప్రకటనలు చేస్తుంటే.మంత్రి సోదరుడు రాజగోపాల్ రెడ్డి త్రిబుల్ ఆర్ అలైన్ మెంట్ మొత్తం మార్చాలాంటూ కొత్త పంచాయితీ కి తెర లేపారు.

‘కాంగ్రెస్ పార్టీలో తన సోదరుడు సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పైకూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కు పెట్టినట్టుగా చర్చ జరుగుతుంది. ‘త్రిబుల్ ఆర్’ దక్షిణ భాగం భూబాధితల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడబోనంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.గతంలో తన రాజీనామ ఎపిసోడ్ ను గుర్తు చేస్తునే వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు నియోజక వర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోను అంటున్నారు..ఎంతటి త్యాగానికైనా వెనకాడబోను “రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్’ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.. ఇది సహచర ఎమ్మెల్యే లకు కొరకరాని కొయ్యగా మారిందట!.. ఎమ్మెల్యే తన నియోజక వర్గ ప్రజలకు అన్యాయం జరిగే తాజా అలైన్మెంట్ ను మునుగోడు ఎమ్మెల్యే గా ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అసలు మొత్తం దక్షిణ భాగం అలైన్మెంట్ ను మార్చాల్సిందే అన్నది ఆయన లేటెస్ట్ డిమాండ్ తో త్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్.. “ట్రబుల్ ఆర్ “గా మరాబోతుందని చర్చ జరుగుతుంది.

అసలు ఎవరిని అడిగి దాన్ని ఈ అలైన్మెంట్ ఆమోదించారని ప్రశ్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.. స్థానిక రైతుల అభిప్రాయం తీసుకోలేదని కనీసం దక్షిణ భాగం ఎమ్మెల్యేలతో నైనా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. వ్యవస్థను స్తంభింప చేస్తేనే అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివస్తుందని రైతులకు న్యాయం జరుగుతుంది అనడం ద్వారా తన రూట్ ఏంటో చెప్పకనే చెప్తున్నారు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలు భూ బాధ్యతల్లో ఉత్సాహం నింపుతుండగా హస్తం పార్టీలో మాత్రం కొత్తపంచాయతీకి తెరలేస్తుందని అభిప్రాయం బలపడుతుంది.అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరారు చేసిన అలైన్మెంట్ కు వ్యతిరేకంగా భూ బాదితులకు మద్దతుగా రాజగోపాల్ రెడ్డి అండగా నిలబడటం ఒక ఎత్త అయితే ఆయన తీసుకున్న స్టాండ్ త్రిబుల్ ఆర్ దక్షిణ భాగంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడంతో పాటు తన అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఇరకాటంలో పెట్టడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇది ఒక మునుగోడు నియోజక వర్గంతోనే ఆగిపోదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. Komatireddy Brothers War.

‘త్రిబుల్ ఆర్’ అనేక చోట్ల అలైన్మెంట్లు మార్చాలని పరిహారం పెంచాలనే డిమాండ్స్ ఉన్న క్రమంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి దూకుడు వ్యాఖ్యలు స్థానికంగా దుమారం లేపుతున్నాయి. ఇటు సొంత పార్టీకి నేతలకు తలనొప్పి కావడంతో పాటు అటు ప్రతిపక్షానికి అస్త్రమవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. త్రిబుల్ ఆర్ భూ బాదితులు ప్రభుత్వాన్ని స్తంభింప చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు పిలుపునిచ్చిన వేల సంఖ్యలో తరలి రావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి. భూ బాదితులతో రాజగోపాల్ రెడ్డి వరుసగా మీటింగ్స్ పెడుతూ ఉండడంతో ‘రాజు కంటే మొండోడే బలవంతుడు’ అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు జిల్లావాసులు. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఎమ్మెల్యేను కాంగ్రెస్ పెద్దలు ఎలా డీల్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.