మోస్ట్ అట్రాక్టెడ్ కంపెనీగా టాప్ ప్లేస్ లో టాటా..!

Tata in top place as the most attracted company: మన దేశంలో ఉద్యోగార్థులకు అత్యంత ఆకర్షణీయ యాజమాన్య సంస్థగా టాటా గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. ర్యాండ్ స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్- 2025 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో లక్షమంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ లిస్ట్ ను తయారుచేశారు. వీరిలో 3,500 మంది భారత్ నుంచి ఒపీనియన్స్ షేర్ చేయగా.. ఈ జాబితాలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్, సాంసంగ్ నిలిచాయి. తొలిసారిగా టాప్‌-10 జాబితాలో బ్యాంకింగ్‌ దిగ్గజమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చోటు దక్కగా.. ప్రభుత్వరంగ సంస్థల నుంచి చోటు దక్కించుకున్న తొలి సంస్థ ఎస్బీఐ కావడం విశేషం.

గడిచిన ఆరు నెలల్లో 38 శాతం మంది తమ పాత ఉద్యోగాలకు గుడ్‌బై పలికినట్టు వెల్లడించిన ర్యాండ్‌స్టడ్‌.. భారత్‌లో ఐటీ, ఐటీఈఎస్‌, జీసీసీ సెక్టార్‌లో ఉద్యోగుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నట్లు తేలింది. Tata in top place as the most attracted company.

మరి టాటా గ్రూప్ ఎక్కువ స్కోర్ సాధించిన అంశాలు ఏంటంటే..
ఆర్థిక పరిపుష్ఠత, కెరీర్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్, కంపెనీ అసెస్ట్స్ వంటి ఈ మూడు అంశాల్లోనూ కంపెనీని ఎంచుకోవడంలో ఉద్యోగులు ఎక్కువగా చూస్తున్నారు. అటు వర్క్ లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్సింగ్, ఈక్వాలిటీ, అట్రాక్టివ్ శాలరీస్, బెనిఫిట్స్ అండ్ పర్క్స్ లాంటివి ఉంటే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఏఐ వినియోగం పెరిగింది. అందుకు తగ్గట్టే నైపుణ్యాలు పెంచుకోవాలని, ఉద్యోగాలను మార్చుకోవాలని చూస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

Also Read: https://www.mega9tv.com/technology/meta-company-is-constantly-developing-new-features-for-its-millions-of-users-around-the-world-and-introduces-whatsapp-feature-quick-recap/