
Central government annual toll pass: వాహనదారులకు బిగ్ అలర్ట్..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ వెహికల్స్ నేషనల్ హైవేలపై తమ జర్నీని మరింత సులభతరంగా, మరింత చవకగా చేసే అవకాశం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆగస్టు 15 నుంచి కొత్త యాన్యువల్ టోల్ పాస్ ను అమల్లోకి తీసుకురాబోతోంది. ఏడాదికి 3 వేలు చెల్లిస్తే చాలు హై వే మీద ఎంచక్కా 200 ట్రిప్పులు నాన్ స్టాప్ గా కొట్టేయవచ్చు. కేవలం 15 రూపాయలతో ఒక టోల్ ప్లాజాను దాటొచ్చంటే నమ్ముతారు. ఈ యాన్యువల్ పాస్ ఇంప్లిమెంట్ తో అది చేయబోతోంది కేంద్రం. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు ఈ వార్షిక పాస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ స్పెషల్ ఫాస్ట్ ట్యాగ్ పాస్ తెలంగాణలోని జాతీయ రహదారులపై వర్తిస్తుందా? హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద చెల్లుతుందా ? అనే సందేహాలను వ్యక్తమవుతున్నాయి. ఆ క్లారిటీ కావాలంటే…
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా..ఈ ఆగస్టు 15 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ను ప్రారంభించనుంది. ఈ యాన్యువల్ పాస్ ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే పదేపదే టోల్ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. వాహనదారులు జాతీయ రహదారులపై ఈజీగా ట్రావెల్ చేసేందుకే వీలుగా కేంద్ర మంత్రి నితిన్ గడక్కర ఈ పాస్ ను ప్రారంభించారు. ఇది తరచుగా హైవే మీద ట్రావెల్ చేసే వారికే ఎంతో ఉపయోగకరం. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఈ యాన్యువల్ పాస్ వర్తిస్తుంది. దీని కోసం వాహనదారుడు 3వేలు చెల్లిస్తే చాలు..ఎలాంటి ఇబ్బంది లేకుండా 200 టోల్ క్రాసింగ్ లు చేయవచ్చు. ఈ పాస్ టోల్ ప్లాజాల దగ్గర వెయిట్ చేసే సమయాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు లక్షలాది వాహనదారులు తమ ప్రయాణాన్ని వేగంగా చేయొచ్చు. అయితే ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవారు కొత్త ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవేపై ట్రావెల్ చేసే వారికి ఈ యాన్యువల్ పాస్ తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మార్గంలో వారంలో కనీసం ఒకటి, రెండుసార్లు వెళ్లే ఎంప్లాయిస్, బిజినెస్ మెన్ లు చాలామందే ఉన్నారు. ఈ నేషనల్ హైవేలో NHAI పరిధిలోని పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాలు కలిపితే ఒకవైపు ప్రయాణానికే ఎంతలేదన్నా 305 రూపాయల వరకు టోల్ చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ యాన్యువల్ పాస్ తీసుకుంటే కేవలం 45 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.దీంతో వార్షిక టోల్పాస్లతో వాహనదారులకు సగటున 7వేల రూపాయల వరకు ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం ఒక్కో టోల్గేట్ దగ్గర 50 నుంచి 100 రూపాయల వరకు టోల్ ఫీజు వాహనదారులు చెల్లించాల్సి వస్తోంది. అలా 200 గేట్లు దాటడానికి ఎంతలేదన్నా 10వేల వరకు ఖర్చవుతుంది. కానీ ఈ వార్షిక పాస్‌తో కేవలం 3వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున 7 వేల వరకు ఆదా అవుతుంది.
ఈ యాన్యువల్ పాస్ నేషనల్ హైవేలపై ఉండే టోల్ గేట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్‌ను వాడాలంటే వాహనదారుడు NHAI పరిధిలోని హైవేల మీదే ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ ORR స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేగా ఉంది. ఇది నేషనల్ హైవే కిందకు రాదు. మరొక విషయం ఏంటంటే ఈ ORRపై ఉన్న టోల్ గేట్లును IRB అనే ప్రైవేట్ ఎంటిటీ ఆపరేట్ చేస్తుంది. ఇవి కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాస్‌లు, డిస్కౌంట్లపై యాజమాన్య విధానాల ప్రకారమే ఇవి టోల్ వసూలు చేస్తాయి. అందుకే ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ORRపై చెల్లుబాటు కాదు. ORRపై ట్రావెల్ చేయాలంటే మీరు ప్రత్యేక టోల్ ఫీజు చెల్లించాల్సిందే. Central government annual toll pass.
ఈ ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ లను సింపుల్ డిజిటల్ ప్రాసెజ్ తో పొందవచ్చు. ఈ పాస్ ను ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.ఇందుకోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయవచ్చు. లేదా ఎన్హెచ్ఏఐ అనే అఫిషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యాక మీ వెహికల్ రిజిస్ట్రేషన్ డీటైల్స్ ను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీ ప్రజెంట్ ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బ్లాక్‌లిస్ట్‌లో లేకుండా ముందుగానే చూసుకోవాలి. యాన్యువల్ పాస్ కోసం 3వేల రూపాయల ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీ యాన్యువల్ పాస్ మీ ప్రస్తుత FASTagకి లింక్ అవుతుంది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు మీరూ ఈ బెనిఫిట్స్ పొందాలంటే వెంటనే యాన్యువల్ పాస్ కోసం అప్లై చేసుకోండి.