
WhatsApp AI Chat: మెటా సంస్థ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కు ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు బిలియన్ల మంది యూజర్లున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, అప్డేట్స్ తో ఉత్తమమైన సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ ఫీచర్ ను తీసుకురానుంది. వాట్సప్ ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో రియల్-టైమ్ వాయిస్ చాట్ ను అందించనుంది. దీనిద్వారా మెటా ఏఐతో కలిసి లైవ్ వాయిస్ చాట్ చేయొచ్చు అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉండగా కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.
దీనిని ఎలా ఉపయోగించాలి అంటే.. చాట్ స్క్రీన్ లో వేవ్ ఫార్మ్ ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత మెటాతో పరస్పర వాయిస్ చాట్ చేయొచ్చు లేదంటే సెట్టింగ్స్ ని వాయిస్ ప్రిఫెరెన్సెస్ సెక్షన్ కి వెళ్లి వాయిస్ మోడ్ ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పుడు ఈ ఫీచర్ డిఫాల్ట్ ఆఫ్ చేసి ఉంటుంది. రియల్ టైమ్ వాయిస్ చాట్ ఫీచర్ కేవలం చాట్ ట్యాబ్ వరకే పరిమితమై ఉంటుంది. వినియోగదారులు కాల్ ట్యాబ్ కి వెళ్లినపుడు మెటా ఏఐ ఐకాన్ ఆటోమేటిక్ గా వేవ్ ఫార్మ్ సింబల్ గా మారుతుంది. దీంతో డీఫాల్ట్ వాయిస్ చాట్‌బాట్ లా పనిచేస్తుంది. వాయిస్ మోడ్ లో ఉన్నప్పుడు స్క్రీన్ పై కొన్ని టాపిక్స్ కనిపిస్తాయి. వినియోగదారులు వాయిస్ చాట్ ను ప్రారంభించేందుకు వీటిని ఉపయోగించొచ్చన్నమాట. WhatsApp AI Chat.