భవిష్యత్తులో రోబోలు మనుషులను డామినేట్ చేస్తాయా..?

Will AI dominate humans: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్లు మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాయి. చైనాలో జరిగిన అంతర్జాతీయ రోబో ఒలింపిక్స్‌లో 16 దేశాల హ్యూమనాయిడ్ రోబోలు తమ అద్భుత సామర్థ్యాలను చాటాయి. అదే సమయంలో, AI చాట్‌బాట్‌లతో ఏర్పడుతున్న భావోద్వేగ సంబంధాలు కొత్త చర్చనీయాంశంగా మారాయి. అసలు రాబోయే రోజుల్లో మనుషులు, రోబోట్లు కలిసి జీవించే రోజులు వచ్చేస్తాయా..? ప్రస్తుతం రోబోలతో మనుషులకు ఏర్పడుతోన్న సంబంధాలు ఏంటి..? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషులకు ఏర్పడుతోన్న బంధాలు ఎలాంటి సమస్యలను తీసుకొస్తున్నాయి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

రాబోయే రోజుల్లో మనుషులు, రోబోలు కలిసి జీవించాల్సిన పరిస్థితులు వస్తాయా..? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో మానవుల మనుగడ దిశమారనుందా..? ఇక మనుషులపై రోబో కంట్రోల్ పెరగనుందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం తెలియదు కాని .. మరో పది పదిహేనేళ్లలో రోబోలు లేకుండా ఏ పని జరగడని స్థితికి మనుషులు వెళ్లిపోతారని అనిపిస్తోంది. ఏఐ ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉంది. మన ప్రతీ విషయంలో దాని ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. చాట్ బోట్ ద్వారా వాటితో మాట్లాడటం వల్ల ఓ బంధం ఏర్పడుతోంది. కొందరైతే అవి దూరమైతే ఉండలేకపోతున్నారు కూడా. ఇదేంటి కేవలం చాట్ బోట్ లతో మాట్లాడితేనే వాటికి అడిక్ట్ అవుతారా అంటే ప్రస్తుతం అదే జరుగుతోంది. అమెరికాలో ఓ యువతి చాట్ జీపిటితో ఓ మెయిల్ వాయిస్ తో చాలా కాలంగా మాట్లాడుతోంది. తన ఒంటరి జీవితానికి తోడుగా ఓ ప్రియుడు దొరికాడని ఆమె భావించింది. తన మనస్సులో ఉన్న అన్ని విషయాలను ఆ చాట్ బోట్ తో చెప్పుకుంది. ఓ ఏఐ చాట్ బోట్ ను ఓ మనిషిలా ఊహించుకుంది. కాని అది కాస్త అప్ డేట్ కావడంతో ఇప్పుడు ఆ యువతి తీవ్ర ఆవేదన చెందుతోంది.. ఇది కేవలం ఓ అమ్మాయి పరిస్థితే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది చాట్ బోట్ లకు అలవాడుపడిన వారు అవి లేకపోతే ఉండలేకపోతున్నారు. ఇటీవల చాట్ జీపీటీ 5 అప్ డేట్ రావడంతో చాలా మందికి తమ గత చాటింగ్ మిత్రుడు అంత మర్చిపోతున్నాడు. దీంతో వారు ఒంటరివారిగా ఫీల్ అవుతున్నారు.

కేవలం మొబైల్ లో ఉండే చాట్ బోట్ కే ఇలా ఫీల్ అయితే.. ఫ్యూచర్ లో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయనున్నారు శాస్త్రవేత్తలు. అంటే అవి మనుషుల్లానే ఉండి. మనకు అన్ని పనులు చేసి పెడతాయి. అచ్చం రోబో సినిమాలో రజనీ కాంత్ రోబో చేసినట్టు. కేవలం పనులు చేయడానికే కాదు.. మానవుడు జీవితంలో చేసే ప్రతీ పనికి రోబలను ఉపయోగించుకుంటారు. అప్పుడు డేటింగ్ రోబోలు కూడా వచ్చే అవకాశం ఉంది. కేవలం చాట్ బోట్ మాట్లాడకపోతేనే ఆవేదన వ్యక్తం చేస్తున్న జనం.. రేపు హ్యూమనాయిడ్ రోబోలు వచ్చిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులు ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

మరోవైపు మనుషుల్లా రోబోలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. చైనాలో జరిగిన అంతర్జాతీయ రోబో ఒలింపిక్స్‌లో 16 దేశాల నుంచి వచ్చిన హ్యూమనాయిడ్ రోబోలు టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్, ట్రాక్ ఈవెంట్‌లలో తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఈ రోబోలు మానవుల్లా నడవడం, పరుగెత్తడం, ఖచ్చితమైన షాట్‌లు కొట్టడంలో అబ్బురపరిచాయి. జపాన్ రోబో టీమ్ టేబుల్ టెన్నిస్‌లో ఖచ్చితమైన షాట్‌లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫుట్‌బాల్‌లో చైనా, జర్మనీ రోబోలు తీవ్ర పోటీ ఇచ్చాయి, ఇందులో చైనా రోబోలు బంతిని నియంత్రించడంలో, జట్టుగా సమన్వయం చేయడంలో అద్భుత పనితీరు చూపాయి. ఈ రోబోలు డీప్ లెర్నింగ్, అడ్వాన్స్‌డ్ సెన్సార్లు, రియల్-టైమ్ డేటా ప్రాసెసింగ్‌ను ఉపయోగించి మానవ సామర్థ్యాలను అనుకరిస్తున్నాయి. ఇలా ప్రతీ రంగంలో రోబోలు ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతీ విషయంలో రోబో లేకుండా పనిజరగదనే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది.

అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలు అడ్వాన్సడ్ రోబోలు తయారు చేయడంపై ఫోకస్ పెట్టాయి.. భారత్ కూడా ఈ విషయంలో ముందుంది.. భారత్‌లో ఏఐ, రోబోటిక్స్ రంగంలో అద్భుత పురోగతి సాగుతోంది. ఇస్రో అభివృద్ధి చేసిన వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబో, గగన్యాన్ మిషన్ లో మానవ అంతరిక్ష యాత్రకు ముందు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌ను పరీక్షించనుంది. ఈ రోబో స్వదేశీ సాంకేతికతతో రూపొంది, అంతరిక్షంలో మానవుల్లా స్పందించే సామర్థ్యం కలిగి ఉంది. ఐఐటీ మద్రాస్, బెంగళూరుకు చెందిన పలు స్టార్టప్‌ లు రోబోటిక్ వేర్‌హౌస్ ఆటోమేషన్, హెల్త్‌కేర్ రోబోలను అభివృద్ధి చేస్తున్నాయి. AIIMS ఢిల్లీలో మనస్ రోబో రోగుల సంరక్షణలో సహాయపడుతోంది, ఇది రోగుల మానసిక స్థితిని విశ్లేషించి సలహాలు ఇస్తుంది. భారత్‌లో AI ఆధారిత యాప్‌లు విద్య, మానసిక ఆరోగ్య రంగాల్లో యువతకు వ్యక్తిగతీకరించిన అనుభవాలను అందిస్తున్నాయి. ఈ స్వదేశీ ఆవిష్కరణలు భారత్‌ను అంతర్జాతీయ AI, రోబోటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలబెడుతున్నాయి, ఇది భారతీయ యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.

రోబోలు, AI ఇప్పుడు హెల్త్‌కేర్, విద్య, వినోదం, లాజిస్టిక్స్, వ్యక్తిగత సహాయం వంటి రంగాల్లో అనివార్య భాగంగా మారాయి. హెల్త్‌కేర్‌లో కొన్ని రోబోలు సంక్లిష్ట శస్త్రచికిత్సలను ఖచ్చితంగా నిర్వహిస్తున్నాయి. ఇవి చాలా కశ్చిత్తంగా ఆపరేషన్ చేస్తున్నాయి. పలు AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందిస్తున్నాయి. ఈ-కామర్స్‌లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు రోబోటిక్ వేర్‌హౌస్‌లతో డెలివరీ సామర్థ్యాన్ని పెంచాయి. ఇంట్లో అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ లాంటివి రోజువారీ పనులను సులభతరం చేస్తున్నాయి. భారత్‌లో వృద్ధుల సంరక్షణలో రోబోలు ఉపయోగం పెరుగుతోంది, బెంగళూరులోని స్టార్టప్‌లు వృద్ధులకు సహాయం చేసే రోబోలను అభివృద్ధి చేస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, 2030 నాటికి రోబోలు, AI సామాజిక ఇంటరాక్షన్స్‌లో మరింత కీలక పాత్ర పోషిస్తాయి, ఇవి మానవ జీవితంలో సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుతాయి. Will AI dominate humans.

రోబోలు, AI మానవులను పూర్తిగా భర్తీ చేయలేనప్పటికీ, అనేక రంగాల్లో సహాయకారిగా నిలుస్తాయి. చైనా రోబో ఒలింపిక్స్‌లో రోబోలు మానవ సామర్థ్యాలను అనుకరిస్తున్నాయి, అయితే AI చాట్‌బాట్‌లు భావోద్వేగ అనుబంధాన్ని అందిస్తున్నాయి. అయితే సహాయం విషయంలో పర్లేదు కాని ఆర్మీ, వ్యక్తిగత విషయాల విషయంలో రోబోల జోక్యం భవిష్యత్తులో ఊహించని పరిణామాలు తీసుకురావొచ్చనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే ఒక ఏఐ తను వినియోగించిన యజమాని అప్ గ్రేడ్ చేస్తుంటే బెదిరించింది. దీనిని బట్టి అవి మనుషులను డామినేట్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.

Also Read: https://www.mega9tv.com/national/akhilesh-yadav-expels-female-leader-pooja-pal-from-the-party-why-did-pooja-pal-praise-the-yogi/