
మిస్ వాల్డ్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. 31వ తేదీ గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు. ఏ కేటగిరీల్లో కాంపిటేషన్స్ ఉంటాయన్నది చాలా మందికి తెలియదు. ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. 1951 నుంచి మిస్ వాల్డ్ పోటీలు జరుగుతున్నాయి. లండన్ కి చెందిన జూలియా మోర్లే మిస్ వాల్డ్ నిర్వహకురాలు. ఇక ఈ ఏడాది ప్రపంచ సుందరి కాంపిటేషన్లలో పోటీ పడేందుకు 108 దేశాల నుంచి అందగత్తెలు వచ్చారు. ఇక పోటీల్లో భాగంగా మొదట 40 మందిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత టాప్ 20, తర్వాత టాప్ 8. వీరిలో ఫైనల్ విజేత డిసైడ్ అవుతుంది. ఇందుకు చాలా తతంగం ఉంది. మొదట ప్రపంచంలోని ఏడు ఖండాలను నాలుగు కేటగిరీల్లో విభజించారు.
ఆఫ్రికా, అమెరికా అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషినియా, యూరప్ కేటగిరీలుగా ఉన్నాయి. ఈ నాలుగు కేటగిరీల నుంచి టాప్ 40 సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక్కో ఖండం నుంచి 10 మంది అన్నమాట. తర్వాత ఒక్కో ఖండం నుంచి టాప్ 5 సెలెక్ట్ చేస్తారు. అంటే మొత్తం 20 మంది పోటీలో మిగులుతారు. తర్వాత ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున ఎనిమిది మందిని ఫైనల్ పోటీకి ఎంపిక చేస్తారు. ఈ 8 మందిలో ఒకరు ప్రపంచ సుందరి కిరీటీం అందుకుంటారు. ఇక సెకండ్, థర్డ్ తర్వాత మిగిలిన వారు ఆయా ఖండాల వారీ విజేతలుగా డిక్లేర్ చేస్తారు. మిస్ వాల్డ్ అంటే కేవలం అందం, బాడీ కొలతలు అనుకుంటే పొరపాటు. చాలా రకాల పోటీలు ఉంటాయి. ముందుగా, స్పోర్ట్స్ ఛాలెంజ్ పేరుతో కాంపిటేషన్ ఉంటుంది.
తర్వాత టాలెంట్ ఛాలెంజ్ పేరుతో సంగీతం, కళలు, డాన్స్ తదితర పోటీలు ఉంటాయి. తర్వాత హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ పేరుతో కాంపిటేటర్ల తెలివి, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్ష ఉంటుంది. వీటితో పాటు మోడల్ ఛాలెంజ్ పేరుతో జరిగే ఫ్యాషన్ షోలో డిజైనర్ డ్రెస్సింగ్, అలాగే సోషల్ యాక్టివిటీస్ పేరుతో బ్యూటీ విత్ ఏ పర్సన్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో కాంపిటేటర్లు ఇచ్చే సందేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే పోటీలో పాల్గొనే వారు స్విమ్ సూటులో వాక్ చేయాలి. అయితే ఈ అంశాన్ని 2014 నుంచి కాంపిటేషన్ నుంచి తొలగించారు. ఇక ఎనిమిది మందితో కూడిన తుది జాబితా ఓకే అవ్వగానే గ్రాండ్ ఫినాలే మొదలవుతుంది. ఇక ఫినాలేకి అటెండ్ అయ్యే జడ్జిలు ఎవరన్నది చివరి నిమిషం దాకా తెలియదు. సాధారణంగా 9 నుంచి 11 మంది జడ్జిలు ఫినాలేలో ఉంటారు. కాంపిటేషన్ పూర్తి అయిన తర్వాత ప్రపంచ సుందరి పేరు డిక్లేర్ చేస్తారు. ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి కిరీటం దక్కుతుంది.