త్వరలో జరగనున్న పొలిటికల్ ఎఫైర్స్..!

CM Revanth Reddy PAC Meeting: త్వరలో జరగనున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఏం చర్చ జరగనుంది. 17న జరగాల్సిన పీఏసీ మీటింగ్ ఎందుకు వాయిదా పడింది. తనకు చెప్పకుండా డేట్ ఫిక్స్ చేయడంపై ఇంచార్జ్ గుర్రగా ఉన్నారా. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతుంది. జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరు ఫైనల్ చేస్తారు.

ఈనెల 22న జరగబోయే టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సబందించి సుదీర్ఘంగా చర్చకు రానుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించ రెండు సంవత్సరాలు అవ్వడంతో పంచాయితీ పాలన కుంటుబడింది. అదే విధంగా గ్రామాల్లో సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. రైతులకు రైతు భరోసా వేసినప్పటికి వాన కాలం పంటలకు సకాలంలో యూరియా సప్లై అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారట. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సాధ్యాసాధ్యాలతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్, రెండో విడత జనహిత పాదయాత్ర, కార్పొరేషన్ పోస్ట్ లు, డీసీసీల నియామకాలు తదితర అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కులగణన, బిసి రిజర్వేషన్ సంబంధించి రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలన్నదీ ఆలోచన చేశారట.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పిసిసి కమిటీలు, పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ పదవులు, డిసిసిలు డైరెక్టర్ల పదవులు ఇంకా పూర్తి చేయలేదు. దీంతో క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొందట. ఇలాంటి పరిస్తితుల్లో ఎన్నికల కు పోతే క్యాడర్ పూర్తి స్థాయిలో సహకరించరనేది పార్టీ పెద్దల అనుమానంగా తెలుస్తోంది. అందుకే పెండింగులో ఉన్న పదవులను ఎన్నికలకంటే ముందే ప్రకటించాలని ఇన్ఛార్జ్ మంత్రులు, నేతలు హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారట. CM Revanth Reddy PAC Meeting.

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ల్లో కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో నిలపాలన్న దానిపై కూడా ఇప్పటికే పార్టీ సర్వే పూర్తి చేసిందట. ఇక ఆశావాహులు కూడా ఎక్కువ అవ్వడంతో పీఏసీ భేటీలో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుందట. అంతేకాదు, అటు ప్రభుత్వం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీద నేరుగా ఆరోపణలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా పీఏసీ మీటింగులో చర్చకు రావడం ఖాయంగా కనిపిస్తోందట. మొత్తానికి 22వ తేదీన జరగనున్న పీఏసీ కమిటీ సమావేశం రేవంత్ ప్రభుత్వానికి కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q