
CM Revanth Reddy: కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం లో పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పట్టు లేకపోవడంతో ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టారు. జిల్లా ఎంపి స్థానం లో బిజెపి ఉన్నప్పటికీ పట్టణంలో పట్టు లేకపోవడంతో గత పదేళ్లలో బీఆర్ఎస్ హవా సాధించింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు చేజారి పోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళంగా తయారైంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం లో ఒకపక్క బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ హవా సాదించడంతో మరోపక్క బిజెపి ఎంపీ స్థానంని గెలుచుకున్న బండి సంజయ్ కుమార్ బిజెపిని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నప్పటికీ పార్టీలో వర్గ పోరు ఉండడంతో ఒకపక్క హుడా చైర్మన్ గా కొనసాగుతున్న నరేందర్ రెడ్డి ని పార్టీ సమావేశంలో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలకు తావు తీసింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుమళ్ళ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోవడంతో తనపై కొన్ని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తాను పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే కొన్ని కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కురుమళ్ళ శ్రీనివాసులు సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నియోజకవర్గ ఇన్చార్జి లేకుండా పోయారు. పార్లమెంటు నియోజవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు, మరోపక్క హుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చారు.
అయితే కరీంనగర్ కు ఆనుకొని ఉన్న మానకొండూరు నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా కవంపల్లి సత్యనారాయణ గెలిచిన తాను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా కరీంనగర్ లో పట్టు సాధించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి . రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టును సాధించేందుకు గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ను హైదరాబాదుకు పిలిపించి కరీంనగర్ లోనే ఉంటూ కరీంనగర్ కార్పొరేషన్ పైనే దృష్టి సాదించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లా లోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తల్లో కొత్త ఉత్సవాన్ని నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకులతో చర్చిస్తున్నారు.
జిల్లా డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. నాయకులు ఒకపక్క హుడా చైర్మన్ గా కొనసాగుతున్న నరేందర్ రెడ్డి ప్రయత్నం చేయగా మరోపక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కి కూడా అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. అయితే కరీంనగర్ పార్లమెంటు నియోజవర్గ కార్యకర్తల మనసుల్లో వెలిచెర్ల రాజేందర్ రావుకే అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొంది కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్ మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల కమలాకర్ ఎవరికి వారే పై చేయి ఉంటుందని అనుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ డిసిసి పీఠం వెలిచాల రాజేందర్ కు తగ్గుతుందా లేక ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి దక్కుతుందా వేచి చూడాల్సిందే. CM Revanth Reddy.
మరి మొత్తానికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు స్థానిక ఎన్నికల్లో తీర్పు ఎటువైపు, గతంలో అభివృద్ధి పరిచిన బి ఆర్ ఎస్ పార్టీకా, లేక ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకా నియోజకవర్గ ప్రజలు తీర్పు ఎటు ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q